Advertising 90's లలో వచ్చిన బైక్‌ యాడ్స్‌ RX100 నుంచి హోండా CBZ ప్రకటనలు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు.

ఏదైనా ప్రొడక్ట్‌ ప్రజల్లోకి వెళ్లాలంటే దానికి కచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అవసరం. ఇందుకోసం ఆకట్టుకునే వీడియోలు లేదా జనాదరణ పొందే ఫోటోలను సంస్ధలు విడుదల చేస్తాయి. నేడు అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి ఆయా సంస్థలు మరింత క్రియేటివిటీని జోడించి వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మార్కెట్‌లో ఏ సంస్థ అయినా సత్తా చాటాలంటే అందుకు వినూత్నమైన ప్రకటనలు చాలా అవసరం. ప్రస్తుత జనరేషన్‌లో ఆధునిక సాంకేతికత సాయంతో ఆటో మొబైల్‌ రంగం ప్రకటనలతో దూసుకుపోతుంది. అయితే 20 శతాబ్దం చివర్లో మాత్రం పరిమిత కలెక్షన్లలోనే మోటార్‌ సైకిళ్ల సంస్థలు వినూత్న ప్రకటనలతో ఆకట్టుకున్నాయి. ఆ కంపెనీలు విడుదల చేసిన ఫన్నీ (ఇప్పుడు ఫన్నీగా అనిపించవచ్చు) యాడ్స్ వివరాలు చూద్దాం.

bike advertisements

దేశంలో గత దశాబ్దాల కాలంలో ఆటో మొబైల్‌ పరిశ్రమ గణనీయమైన మార్పును సాధించింది. ముఖ్యంగా ఇండియాలో 100-400cc టూ-స్ట్రోక్ మోటార్‌ సైకిళ్ల స్వర్ణ యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత 100-125 సీసీ కమ్యూటర్స్‌ యుగం మొదలైంది. ఇప్పుడు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని 200-500 సీసీ స్పోర్ట్ బైక్‌లు వచ్చాయి. 21వ శతాబ్దంతో పోలిస్తే.. 20 వ శతాబ్దంలో కొనుగోలుదారులకు కేవలం పరిమిత సంఖ్యలోనే ద్విచక్ర వాహనాల మోడళ్లు అందుబాటులో ఉండేవి.

ప్రస్తుత జనరేషన్‌లో సాంకేతికంగా ఆటో మొబైల్‌ రంగం పురోగతి సాధించినప్పటికీ ప్రకటనల విషయానికొస్తే మాత్రం 20వ శతాబ్దంలో మోటార్‌ సైకిళ్ల ప్రకటనలో ఆయా సంస్థలు సృజనాత్మకతను జోడించి వినియోగదారులను ఇట్టే ఆకర్షించేవి. వాటి తయారీతో పాటు ఫీచర్లను వీడియోలో వివరిస్తూ ప్రకటనలు ఆకట్టుకునేవి. 1980లలో వీడియో ప్రకటనలు ఎలా ఉండేవో.. ఈ కథనం కింద వీడియోలో చూడవచ్చు.

yamaha RX100

యమహా RX100 - వీడియోలో మొదటగా 1980 ల చివరి నుంచి యమహా RX100 కు సంబంధించి వాణిజ్య ప్రకటన మొదలవుతుంది. ఇది పవర్‌ - టు - వెయిట్‌ రేషియోకు ప్రసిద్ధి చెందింది. ఈ బైక్‌ 100 సీసీ ఇంజిన్‌ కలిగి ఉన్నప్పటికీ వాహనదారులకు రైడింగ్‌ విషయంలో సంతృప్తినిచ్చింది. కాలక్రమేణా RX100 మార్కెట్‌లో కనుమరుగైనా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వాహనదారులకు ఫేవరెట్‌గా మారి ఇండియన్‌ రోడ్లపై మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి.

హీరో హోండా CD100 - హీరో హోండా జాయింట్‌ వెంచర్‌ నుంచి మొదటగా వచ్చిన మోటార్ సైకిళ్లలో CD100 ఒకటి. అంతే కాకుండా దేశంలోని మొదటి 100cc ఫోర్-స్ట్రోక్ కమ్యూటర్లలో ఇది ఒకటి కావడం విశేషం. వాణిజ్య ప్రకటనల్లో 'ఫిల్ ఇట్- షట్ ఇట్- ఫర్గెట్ ఇట్' ప్రచారం ద్వారా CD100 బాగా ప్రాచుర్యం పొందింది. 1990లలో ప్రసారమైన ఈ ప్రకటనను బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేయడం ఆసక్తికరం.

bazaz sunny

బజాజ్‌ సన్నీ - ఇప్పటివరకూ పరిచయం చేసిన టూ వీలర్లన్నీ ఫోర్‌ స్ట్రోక్‌ ఫీచర్‌తో ఉన్నవైతే వాహనదారులు తక్కువ దూరం ప్రయాణం చేసేందుకు వీలుగా అందులోనూ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్‌ బజాజ్‌ సన్నీ. కైనెటిక్ హోండా ZX, TVS స్కూటీతో పాటు, బజాజ్ సన్నీ కూడా ఇండియాలో ప్రసిద్ధి చెందిన టూ-స్ట్రోక్ స్కూటర్. 50cc టూ-స్ట్రోక్ ఇంజన్ ఉన్నప్పటికీ, బజాజ్ సన్నీ గరిష్ఠంగా గంటకు 50 km వేగంతో దూసుకుపోతుంది.

బజాజ్ పల్సర్ - దేశీయ మార్కెట్‌లో బజాజ్ పల్సర్ శక్తివంతమైన కమ్యూటర్‌గా పేరు తెచ్చుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 21వ శతాబ్దం మొదటి దశకంలో.. పల్సర్‌లో వచ్చిన విభిన్న వెర్షన్‌లకు సంబంధించి బహుళ ప్రకటనలు ప్రజాదరణ పొందాయి. బజాజ్‌ పల్సర్‌కు సంబంధించి మొదటి అడ్వర్‌టైజ్‌మెంట్‌ 2001లో బజాజ్‌ పల్సర్‌ 150cc, 180cc ద్వయంతో ప్రారంభమైంది. "ఇట్స్ ఎ బాయ్" అనే ట్యాగ్‌లైన్ ద్వారా ప్రత్యేకంగా పురుషులకు పల్సర్‌ ఫేవరెట్‌ ఆప్షన్‌గా మారింది.

యమహా RD350 - యమహా RD350 భారతీయ మార్కెట్లో మొట్టమొదటి ఐకానిక్ మోటార్‌ సైకిల్‌గా విస్తృతంగా గుర్తింపు సాధించింది. ఈ 2-స్ట్రోక్, 350cc సింగిల్-సిలిండర్ మోటార్‌ సైకిల్ క్రమంగా భారతీయ కొనుగోలుదారులలో జనాదరణ పొందిందనడంలో ఎలాంటి సందేహం లేదు. యమహా RD350 సామర్థ్యం ద్వారా కొనుగోలుదారులు ఈ బైక్‌పై ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. అంతే కాకుండా 1980లలో టార్క్‌ ఇండక్షన్‌ వంటి నూతన సాంకేతికతను పరిచయం చేసిన మొట్టమొదటి ప్రొడక్ట్‌ ఇదే.

హీరో హోండా CBZ - ఎకానమీ-ఆధారిత మోటార్‌ సైకిళ్లతో ప్రజలకు సేవలందిస్తున్న హీరో హోండా, 21వ శతాబ్దం ప్రారంభంలో CBZని ప్రారంభించడం ద్వారా యువతకు బ్రాండ్‌గా స్థిరపడాలని భావించింది. CBZ భారతదేశంలో మొట్టమొదటి 150cc ఫోర్-స్ట్రోక్ మోటార్‌సైకిల్, స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో యువతలో ప్రజాదరణ పొందిందనడంలో అతిశయోక్తి లేదు. హీరో హోండా CBZ ప్రకటన, బైక్ స్టైలిష్ ప్రదర్శన, ఆకర్షణ యువతను మరింతగా అట్రాక్ట్‌ చేస్తూ ఇప్పటికీ మార్కెట్‌లో మోస్ట్‌ ఫేవరెట్‌గా కొనసాగుతోంది.

More from DriveSpark

Article Published On: Monday, May 15, 2023, 10:09 [IST]
English summary
Bike advertisement videos in 90s makes makes you laugh here in the videos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+