ఇప్పటి వరకు మీరు చూడని బైక్ లోగోస్.. పదిసార్లు లోగో మార్చిన KTM

ఏదైనా బ్రాండ్ కి గుర్తింపు ఉండాలంటే దానికి కంపల్సరీగా లోగో అనేది అవసరం. లోగోని బట్టి కంపెనీ క్రెడబిలిటీ (విశ్వసనీయత) ఇతర అంశాలు ముడిపడి ఉంటాయి. అలాంటి లోగోను క్రియేట్ చేసేందుకు కంపెనీలు కూడా చాలా ప్రయోగాలు చేస్తాయి. కస్టమర్ల అనుభూతికి తగ్గట్లు ఎప్పటికప్పుడు సరికొత్త లుక్ లో వాటిని మారుస్తూ ఆకట్టుకుంటాయి.

అలానే వివిధ బైక్స్ సంస్థలు ఇప్పటి వరకు తమ లోగోలను చాలా సార్లు ఛేంజ్ చేశాయి. బైక్స్ లోని ఫీచర్లతో పాటు లోగోని కూడా కొందరు కస్టమర్లు ఇష్టపడతారు. లోగో ద్వారా ఆ బ్రాండ్ ముఖ్యంగా బైక్ కి మరింత గుర్తింపు వస్తుందని వారి విశ్వాసం. ఏఏ కంపెనీలు ఇప్పటి వరకు తమ లోగోను మార్పు చేశాయో ఈ కథనంలో తెలుసునే ప్రయత్నం చేద్దాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్..

చెన్నైకి చెందిన ఈ బైక్‌ మేకర్‌ కంపెనీకి బ్రిటీష్ మూలాలు ఉన్నాయి. 1901లో మొదటి మోటార్‌ సైకిల్‌ ను ఈ సంస్థ విడుదల చేసింది. బైక్ తయారీలోకి రాకముందు, కంపెనీ తుపాకులు, కుట్టు సూదులు, సైకిళ్లు, లాన్ మూవర్స్, క్వాడ్రిసైకిల్స్, ఫిరంగులను తయారు చేయడంలో ఎక్స్ పర్ట్ గా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉండేది. ఈ బైక్ లోగో ఆనాటి నుంచి నేటి వరకు అనేక మార్పులు చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్

ఈ సంస్థ ఇప్పటి వరకూ తమ లోగోను మూడు సార్లు మార్చింది. 1901లో ఒకసారి అదే సంవత్సరం నుంచి 2013 వరకు ఒక లోగోను వాడింది. ప్రస్తుతం ప్రీమియర్ బైక్ లోగోను సులభంగా గుర్తించవచ్చు. ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో, 2013 నుంచి కంపెనీ ఉపయోగిస్తుంది. ఇది "R" అండ్"O", "E" అండ్ "N", ఆఖర్లోని "L" అండ్ "D" అక్షరాలు కలిసి ఉంటాయి. పాత రాయల్-లుకింగ్ లోగో మరింత ఆధునిక వెర్షన్ ని కలిపి మార్పుచేశారు. 'మేడ్ లైక్ ఎ గన్' అనే ఈ కంపెనీ నినాదం ఇప్పటికీ వాడుకలో ఉంది.

హీరో హోండా

హీరో హోండా..

అప్పట్లో బైక్స్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే బ్రాండ్ హీరో హోండా. 2000 దశాబ్దంలోని యువత, బైక్ ప్రేమికులకు ఈ బైక్ లోగో చాలా సుపరిచితం. అప్పట్లో హీరో హోండా బైక్ ఉందంటే కారు ఉన్నంత ఫీల్ అయ్యేవారు. అంటే దాని క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో మీరే ఊహించుకోండి. మోటార్ సైకిళ్ల ఫీల్డ్ లో ఉన్న హోండా కంపెనీ హీరో సైకిల్స్ తో కలిసి 1984లో హీరో కంపెనీని స్థాపించాయి.

'fill it, shut it, forget it' అనే నినాదంతో మార్కెట్ లోకి వచ్చిన హీరోహోండా టూ వీలర్ మార్కెట్ ను శాసించింది. అనంతరం 2011నుంచి హీరో,హోండా విడిపోయాయి. 1984 నుంచి 2011 వరకు హీరో కంపెనీ హీరో హోండా లోగోలో కనిపించింది. అనంతరం 2011 నుంచి హీరో తన లోగోతో కంటిన్యూ అవుతుంది. ఇక హోండా తొమ్మిది సార్లు తమ లోగోను మార్చింది. 1988లో మార్చిన లోగోను కంపెనీ ఇంకా ఉపయోగిస్తుంది.

బజాజ్

బజాజ్..

బజాజ్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద కంపెనీ. భారత్ లో రెండవ అతిపెద్ద మోటార్ సైకిల్ తయారీదారుగా కొనసాగుతోంది. అయితే మొదటగా దేశంలో ద్విచక్ర, త్రీ వీలర్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తూ కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్ లోగో 1945 నుంచి ఉండగా ఒక్కసారి మాత్రమే మార్చబడింది. చేతక్‌ లో పాత లోగోను చూడవచ్చు. 2004లో మరోసారి లోగోను మార్పు చేసింది. అయితే పల్సర్ మోడల్ లో కొత్త లోగోను ప్రముఖంగా గుర్తింపు పొందింది.

కేటీఎమ్

KTM..

1953లో కారు రిపేర్ షాప్‌ గా ఈ కంపెనీ ప్రారంభమైంది. మొదటిసారిగా పులితో కూడిన లోగోను ఇది వచ్చింది. ఆ లోగోను వెంటనే మార్చింది. కానీ KTM ఎప్పటికప్పుడు తమ లోగోలను మారుస్తూ వస్తూనే ఉంది. ఈ కంపెనీ అత్యధికంగా 10 సార్లు తమ లోగోలో మార్పులు చేసింది. 2013 నుంచి ప్రస్తుతం ఉన్న లోగోను కంపెనీ ఉపయోగిస్తుంది.

ఎల్ ఎమ్ ఎల్

LML..

లోహియా మెషీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సింథటిక్ నూలు తయారీదారుగా 1972లో ప్రారంభమైంది. 1984లో పియాజియోతో (Piaggio) కలిసి స్కూటర్ ప్రాజెక్ట్ అవతరించింది. అనంతరం దాని తర్వాత LML పేరుతోనే కొనసాగింది. 2022లో సరికొత్తగా మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించడం ద్వారా మళ్లీ ఈ కంపెనీ మార్కెట్ లోకి పునరాగమనం చేసింది. కానీ ఈ సంస్థకు భారత్ లో ఆశించిన మార్కెట్ లేకపోవడం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Tuesday, March 7, 2023, 19:27 [IST]
English summary
Bikemakers has changed their logo through the years
Read more on: #బైక్ #bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+