Bikes Under 1 lakh లక్షలోపు లభించే ఈ బైక్స్ ని కళ్లుమూసుకుని కొనేయొచ్చు..!
చాలామంది బైక్ కొనేటప్పుడు కంపెనీలు అందిస్తున్న ఫీచర్లతో సహా వాటి ధరలను కూడా బేరీజు వేసుకుంటారు. అనుకున్న ధరలో బైక్ లభిస్తే కొనడానికి ఆసక్తి చూపిస్తారు లేదంటే వారి ప్రణాళికను మార్చుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులు అన్నీ దాదాపు లక్షకు పైగే ఉంటున్నాయి. ఇక ప్రీమియం బైక్ ల గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఇక్కడ మీకోసం దాదాపు లక్షలోపు లభించే అత్యుత్తమ బైక్ ల వివరాలను మీకు అందిస్తున్నాం. ఒక లక్ష లోపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులైన హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్ బజాబ్ వివిధ రకాల బైక్‌లను విక్రయిస్తున్నాయి. ఈ సంస్థల నుంచి లక్షలోపు అందుబాటులో ఉన్న బైక్స్ చాలా పేరొందినవి. ఆ వివరాలు మీకోసం..

హీరో మోటోకార్ప్ గ్లామర్..
ముందుగా ఈ జాబితాలో మనం మాట్లాడుకోవాల్సింది హీరో గ్లామర్. అద్భుతమైన ఇంజన్ పనితీరుతో ఈ బైక్ లక్షలుకు అందుబాటులో ఉంది.124.5 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో ఈ బైక్ పని చేస్తుంది. ఇది 10.73 bhp వద్ద 10.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా పొందుతుంది. ఈ బైక్ అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. లీటర్ కు 55 kmpl మైలేజీని అందిస్తుంది.
'హీరో మోటోకార్ప్' విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ బైక్‌లలో 'గ్లామర్' ఒకటి. ఇది స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌కు సమానం. ఈ హీరో గ్లామర్ రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. సెల్ఫ్-స్టార్ట్ డ్రమ్ వేరియంట్ ధర రూ.78768, సెల్ఫ్-స్టార్ట్ డిస్క్ వేరియంట్ ధర రూ.82768 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
హెండా షైన్..
దేశీయ విపణిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న విశ్వసనీయ బైక్‌లలో హోండా 'షైన్' ఒకటిగా ఉంది. ఇది రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఇది డ్రమ్ వేరియంట్ లో రూ.78687, డిస్క్ వేరియంట్ లో రూ.82697లకు ఎక్స్-షోరూమ్ ధరలతో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి ఈ బైక్ అందుబాటులో ఉంది. అదనంగా, ఈ బైక్ వినియోగదారులను ఆకర్షించే అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
హోండా షైన్ బైక్ 123.94 సిసి సిలిండర్ ఇంజన్ కలదు. ఇది10.59 bhp వద్ద 11NM గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. 10.5 లీటర్ సామర్థ్యం గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. అలాగే 55 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
'బజాజ్ సిటీ100'
బజాజ్ కంపెనీకి చెందిన ప్రముఖ ప్లాటినా తర్వాత, 'సిటీ 100' ప్రజాదరణ పొందింది. ఇది రూ.72224 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 115.4 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 8.71 bhp వద్ద 9.81 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10.5 లీటర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. 75 kmpl మైలేజీని అందిస్తుంది.
'టీవీఎస్ స్పోర్ట్'
TVS స్పోర్ట్ భారతీయ మార్కెట్లో కూడా ప్రసిద్ధి చెందింది. సెల్ఫ్ స్టార్ట్ మరియు కిక్ స్టార్ట్ అనే రెండు ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.64050 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 8.1 bhp గరిష్ట శక్తిని మరియు 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 109.7 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది.
'టీవీఎస్ రైడర్'
TVS కంపెనీ 'రైడర్' బైక్ కొంచెం విలాసవంతమైనది. బ్లూటూత్ కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ స్క్రీన్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులోని 124.8 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 11.22 bhp వద్ద 11.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకుంటుంది. రూ. 93719 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








