Bikes Under 80000 ఈ బైక్స్ లో పెద్ద సీట్లు, ఎక్కువ మైలేజ్, ధర తక్కువ ఇంకా మరెన్నో బోలెడు లాభాలు..!

ఎవరైనా ఈ రోజుల్లో బైక్ కొనాలనుకుంటే ముందుగా దాని ధరను చూస్తారు. దానితో పాటు అది అందించే మైలేజ్, బైక్ లో ఉన్న ఫీచర్ల ఆధారంగా కొనుగోలు చేయాలా వద్దా అనే అంశాన్ని బేరీజు వేసుకుంటారు. ఆ తర్వాత ఎక్కువ మంది చూసేది సీటు స్పేస్ వెనక రైడర్ అనువుగా కూర్చునేలా రూపొందించారా లేదా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

ప్రస్తుతం దేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం రోజు రోజుకి క్రమంగా పెరుగుతోంది. అందుకు తగినట్లు అందుబాటు ధరలో పలు కంపెనీలు కొత్త బైక్స్ ని విడుదల చేస్తున్నాయి. పొడవాటి సీటుతో పాటు ఎక్కువ కంఫర్ట్ ఉండే బైక్స్ ని కంపెనీలు రూపొందిస్తున్నాయి. అధిక మైలేజ్ తో పాటు తక్కువ ధరలో లభిస్తున్న టాప్-5 కంఫర్ట్ బైక్ లు మీకోసం..

bajaj ct 125x

బజాజ్ సిటీ 125X: ఈ జాబితాలో ముఖ్యంగా చర్చించుకోవాల్సింది బజాజ్ CT 125X. ఈ బైక్ మెరుగైన పనితీరు గల ఇంజన్ తో పాటు ఇద్దరు వ్యక్తుల కోసం చాలా విశాలమైన సీటుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. బజాజ్ నుంచి వస్తున్న ప్రధాన ఉత్పత్తులలో ప్రత్యేక బైక్ గా ఇది నిలిచింది. 124.4cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఇది పనిచేస్తుంది.

ఇది 8000rpm వద్ద 10.7bhp మరియు 5500rpm వద్ద 11Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బేస్ డ్రమ్ వేరియంట్‌లో ఈ బైక్ ధర రూ.72077 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ప్రారంభమవుతాయి. ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఎక్స్-షోరూమ్ లో దీని ధర రూ. 72077గా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

బజాజ్ ప్లాటినా: తక్కువ ధరలో లభించే మరో కంఫర్ట్ బైక్ బజాజ్ ప్లాటినా. దీనిని డెలివరీ బైక్ గా ముద్దుగా పిలుచుకుంటారు. ప్లాటినా బైక్ ని చాలా మంది తమ వ్యాపార నిర్వహణలో వినియోగిస్తూ ఉంటారు. ఈ బైక్ డిజైన్ అండ్ పొడవైన సీటు కలిగి ఉండటంతో మార్కెట్ లో దీనిని భారీ డిమాండ్ ఉంది. దీనిపై ఇద్దరు వ్యక్తులకు చాలా సౌకర్యంగా ప్రయాణించవచ్చు.

ప్లాటినా 100 ధరలు రూ. 65856(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. 102cc BS6 ఇంజన్ కలిగిన ఈ బైక్ 7.79bhp వద్ద 8.34Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్లాటినా మోడల్ లో మెరుగైన బైక్ ఇంజన్ పనితీరు కావాలనుకునేవారు ప్లాటినా 110 లేదా ప్లాటినా 110 ABSని ఎంచుకోవచ్చు. వీటి ధరలు వరుసగా రూ. 68544, రూ. 72224 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

tvs radeon

టీవీఎస్ రేడియన్: ప్లాటినాకు పోటీదారుగా TVS నుంచి రేడియన్ రూపంలో బైక్ అందుబాటులో ఉంది. వినియోగాదురుల సౌకర్యం కోసం సీటు చాలా పొడవుగా ఉండనుంది. ఇద్దరు వ్యక్తులు సులభంగా వెళ్లేలా దీనిని సంస్థ రూపొందించింది. ఈ బైక్ ధరలు రూ. 60925 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త డీజీ డిస్క్ వేరియంట్‌తో ధర రూ. 78834 (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది.

హోండా సిడీ110: హోండా CD 110 డ్రీమ్ డీలక్స్ అత్యంత పొడవు సీటు కల్గిన కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంది. 109.51cc BS6 ఇంజన్‌తో పనిచేయనుంది. ఇది 8.67bhp వద్ద 9.30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CD110 బైక్ డ్రీమ్ డీలక్స్, స్టాండర్డ్ డీలక్స్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. రెండింటి ధరలు రూ. 71113 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి.

hero super splendor

హీరో సూపర్ స్ప్లెండర్: ఇక ఆఖర్లో సరసమైన ధరలో అందుబాటులో ఉన్న బైక్ సూపర్ స్ప్లెండర్. ఇది 798 మిమీ సీట్ ఎత్తుతో, సూపర్ స్ప్లెండర్ CD110 డ్రీమ్ డీలక్స్ కంటే కొంచెం ఎత్తుగా కూర్చోవచ్చు. దీని డ్రమ్ వేరియంట్ ధర వేరియంట్‌ ధర రూ. 79118 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభం కానుంది. అయితే డిస్క్ బ్రేక్ వేరియంట్ కి కాస్త ధర ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీని ధర రూ. 83248 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Friday, April 21, 2023, 10:42 [IST]
English summary
Bikes under 80000 with more seat space and mileage
Read more on: #బైక్స్ #bikes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+