రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 Vs హార్లీ డేవిడ్‌సన్ X440 లలో ఏది బెస్ట్?
ఎట్టకేలకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లీ-డేవిడ్‌సన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త హార్లీ-డేవిడ్‌సన్ X440 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 తో నేరుగా పోటీపడుతోంది. ఈ రెండు బైక్‌ల మధ్య తేడాలు మీ కోసం..
హార్లీ డేవిడ్‌సన్ X440 డిజైన్ విషయానికొస్తే ఇది పెద్ద మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు సొగసైన టెయిల్ సెక్షన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. అదనంగా, ఈ బైక్ నియో-రెట్రో రూపాన్ని ఇవ్వడానికి వృత్తాకార డిజైన్ అంశాలను కలిగి ఉంది. ఈ కొత్త హార్లీ డేవిడ్‌సన్ X440లో LED హెడ్‌ల్యాంప్‌లు మరియు LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ డిజైన్ చూసుకుంటే ఈ బైక్ డిజైన్ చాలా హుందాగా ఉంటుంది. ఈ బైక్‌ను తక్షణమే రాయల్ ఎన్‌ఫీల్డ్‌గా గుర్తించవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 హుందాతనమైన లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 చాలా అనుకూలీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కొత్త హార్లీ డేవిడ్‌సన్ X440 ఇంజిన్ గురించి మాట్లాడితే.. ఈ బైక్‌లో సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, 440సీసీ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ సుమారుగా 27 బీహెచ్‌పీ వద్ద 38 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ని అమర్చారు. ఈ ఇంజిన్ 20.2 బీహెచ్‌పీ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఈ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
కొత్త హార్లీ డేవిడ్‌సన్ X440 ఫీచర్లను పరిశీలిస్తే ఈ బైక్ LED లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. అంతే కాకుండా యాంబియంట్ లైట్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మ్యూజిక్ కంట్రోల్ మరియు గేర్ పొజిషన్ లాంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది.
హార్లీ డేవిడ్‌సన్ X440 మోటార్‌సైకిల్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి ఉండనుంది. డెనిమ్, వివిడ్ మరియు ఎస్. ఇందులో డెనిమ్ బేస్ వేరియంట్ కాగా.. ఎస్ అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్‌షో రూంలో రూ.2.29 లక్షలుగా ఉంది. మిడ్ లెవల్ వేరియంట్ వివిడ్ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూం). హై ఎండ్ మోడల్ ధర రూ.2.69 (ఎక్స్‌షోరూం)గా ఉంటుంది.
హార్లీ డేవిడ్‌సన్ X440 మోటార్‌సైకిల్ నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. మస్టర్డ్ డెనిమ్, మెటాలిక్ డార్క్ సిల్వర్, మెటాలిక్ థిక్ సిల్వర్, మ్యాటీ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. అయితే మస్టర్డ్ డెనిమ్, మ్యాటీ బ్లాక్ రంగులు కేవలం డెనిమ్, ఎస్ వేరియంట్లు మాత్రమే కలిగి ఉంటాయి. ఇవి మోటార్ సైకిల్‌ను మరింత స్టైలిష్‌గా చేస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








