E Sprinto Ameri మార్కెట్‌లోకి సరికొత్త స్కూటర్.. రేంజ్ తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈవీలు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయి. దీనికి అనుగుణంగా వివిధ కంపెనీలు కనీసం నెలకోసారి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా అధునాతన ఫీచర్లతో E-Sprinto Ameri ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి విడుదలైంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఇ-స్ప్రింటో తన హై-స్పీడ్ అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. e-Sprinto Ameri దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఆకర్షణీయమైన డిజిటల్ డిస్‌ప్లే, యాంటీ థెఫ్ట్ అలారం, రిమోట్ కంట్రోల్ లాక్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఫైండ్ మై వెహికల్ అప్లికేషన్‌తో సహా పలు ఫీచర్లను అందించనుంది.

E-Sprinto Ameri ఎలక్ట్రిక్ స్కూటర్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. దీని బరువు 98 కిలోలుగా సంస్థ ప్రకటించింది. ఈ ఈవీ 12 డిగ్రీల గ్రేడ్ సామర్థ్యం మరియు 150 కిలోల బరువు మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్కూటర్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే ఇందులో ఫ్రంట్ డిస్క్, అరుదైన డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఈ ఈవీ ప్రత్యేకత.
ఈ అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్ 60V 50AH లిథియం అయాన్ NMC బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అమెరీ ఈవీ పూర్తి ఛార్జ్‌పై 140 కిమీల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు. అలాగే దీని 1500W BLDC హబ్ మోటార్ ద్వారా 3.3 hp వద్ద పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

E-Sprinto Ameri ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 6 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందిస్తుంది. ఈవీ గరిష్ఠ వేగం గంటకు 65 కి.మీ. అలాగే, దీని బ్యాటరీ ప్యాక్ 0-100 శాతం ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఈ స్కూటర్ మూడు రంగుల ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బ్లిస్ఫుల్ వైట్, మ్యాట్ మరియు హై స్పిరిట్ ఎల్లో కలర్స్‌లో లభించనుంది.
ఈ ఇ స్ప్రింటో అమెరీ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.1.30 లక్షలతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. కానీ ఈ రేటు ప్రారంభ 100 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఆసక్తి గల వినియోగదారులు ఇ-స్ప్రింటో డీలర్‌షిప్‌ల ద్వారా ఇ స్ప్రింటో Ameri స్కూటర్‌ని ఆర్డర్ చేయవచ్చు.

ఇ-స్ప్రింటో అమెరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడంపై కంపెనీ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అతుల్ గుప్తా మాట్లాడుతూ, 'మా వినియోగదారులకు సరికొత్త ఇ-స్కూటర్‌ను పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. దీని అధునాతన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన లుక్ కారణంగా చాలా మంది యువ కొనుగోలుదారులు దీన్ని ఇష్టపడతారు'. అని అన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








