ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారా.. ప్రారంభ ధరలు రూ.54999, రూ.62999కే కొత్త ఇ-స్కూటర్లు..!!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. తాజా ఇ-స్ప్రింటో (e-sprinto) సంస్థ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న rapo మరియు roamy ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 6 మోడళ్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
రోమీ ఇ-స్కూటర్ ప్రారంభ ధర రూ.54,999 (ఎక్స్‌షోరూం) మరియు రాపో ప్రారంభ ధర రూ.62,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది. కాలేజీ విద్యార్థులు, పట్టణ ప్రజలు, కార్మికులు సహా అన్ని వర్గాలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఇ-స్ప్రింటో తెలిపింది.

ఇ-స్ర్పింటో రాపో స్పెసిఫికేషన్లు : ఈ స్కూటర్ పొడవు 1840mm, 720mm వెడల్పు, 1150mm ఎత్తు మరియు 170mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. పోర్టబుల్ ఆటో కటాఫ్ ఛార్జర్‌తో కూడిన లిథియం/ లీడ్ బ్యాటరీ, IP65 వాటర్‌ఫ్రూఫ్ రేటింగ్‌తో 250W BLDC హబ్ మోటార్‌కు శక్తినిస్తుంది.
Rapo ఇ-స్కూటర్ గరిష్ఠంగా 25 kmph వేగాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 100 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. 12 అంగుళాల ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 10 అంగుళాల వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. 150 కిలోల లోడింగ్ కెపాసిటీతో వస్తుందని ఇ-స్ర్పింటో తెలిపింది.

రోమీ స్పెసిఫికేషన్లు : ఇ-స్కూటర్ పొడవు 1800mm, 710mm మరియు ఎత్తు 1120mm మరియు 170mm గ్రౌండ్ క్లియరెన్స్, పోర్టబుల్ ఆటోకట్ ఆర్ ఛార్జర్‌తో లిథియం/లీడ్ బ్యాటరీని కలిగి ఉంది. 250W BLDC హబ్ మోటార్, IP65 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.
రోమీ ఇ-స్కూటర్ గరిష్ఠంగా 25 kmph వేగాన్ని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌లో 100 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో కూడిన కాయిల్ స్ర్పింగ్ సహా 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పె్న్షన్ ఉన్నాయి. 150 కిలోల లోడ్ సామర్థ్యంతో వస్తుంది.

ఫీచర్‌లు : ఈ రెండు మోడ్‌లు రిమోట్ లాక్/ అన్‌లాక్, రిమోట్ స్టార్ట్, ఇంజిన్ కిల్ స్విచ్/ చైల్డ్ లాక్/ పార్కింగ్ మోడ్ మరియు USB ఆధారిత మొబైల్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లేలో బ్యాటరీ స్థితి, మోటార్ వైఫల్యం, థొరెటల్ వైఫల్యం మరియు కంట్రోల్ వైఫల్యం వివరాలను తెలియజేస్తుంది.
రాపో ఇ- స్కూటర్ రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్ అండ్ వైట్ రంగుల ఆప్షన్‌లో లభిస్తుంది. రోమీ ఇ-స్కూటర్ రెడ్, బ్లూ, నలుపు, వైట్, బూడిద రంగుల్లో లభిస్తుంది. అత్యంత చౌక ధరకు అందుబాటులోకి వస్తుండడంతో కస్టమర్ల నుంచి భారీ స్పందన వస్తుందని సంస్థ భారీ అంచనాలు పెట్టుకుంది.

ఇ-స్ర్పింటో స్కూటర్ సహా వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ అతుల్ గుప్తా ఈ స్కూటర్ల విడుదలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ రెండు ఈవీలు భద్రత, మన్నికను ఇస్తాయని హామీ ఇచ్చారు. తాము వినూత్న ఉత్పత్తులను పరిచయం చేసేందుకు మరియు మరింత వైవిధ్యపరిచేందుకు చురుగ్గా అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








