eclectic bicycle 20 ఏళ్లకే రూ.20 వేల ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కి.మీ రేంజ్

దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హహా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చాలా కంపెనీలు వివిధ విభాగాల్లో వాహనాలను విడుదల చేస్తున్నాయి. వీటికి ఉన్న క్రేజ్ ఆధారంగా చాలా కంపెనీలు వ్యక్తులు పలు ప్రయోగాలు చేస్తూ వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. సరికొత్తగా వస్తున్న ఈ EVలు వినియోగదారుల్నీ ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగా ఓ వ్యక్తి రూపొందిన ఎలక్ట్రిక్ సైకిల్ ఆకట్టుకుంటుంది.

కేవలం రూ. 20,000 లకే ఓ అధునాతన ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసి ఓ వ్యక్తి ఔరా అనిపించాడు. ఎలక్ట్రిక్ బైక్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌కు చెందిన ఆదిత్య శివహారే అనే 20 ఏళ్ల యువకుడు రూపొందిన ఈవీ సైకిల్ స్థానికులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన పనితీరుతో పాటు ఫీచర్ల పరంగా ప్రముఖ బ్రాండ్‌లతో పోటీ పడేలా ఎలక్ట్రిక్ సైకిల్ ను తను అభివృద్ధి చేశాడు.

Electric Bicycle

ఆదిత్య శివహారే అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక క్వింటాల్ వరకు బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 30 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించగలదు. అతి తక్కువ ధరలో దీనిని రూపొందిన ఆ వ్యక్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో దీనిని తయారు చేయడంపై పలువురు ఇతని పనితీరును మెచ్చుకుంటున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసేందుకు ఆదిత్యకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే పట్టింది. ఇది ఎలక్ట్రిక్ సైకిళ్లలో లభించే ఫీచర్లకంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో యాక్సిలరేటర్, బ్రేక్, లైట్ హారన్ వంటి బైక్ లో ఉండే ఆధునిక ఫీచర్లను శివహారే జోడించారు. ఇ-సైకిల్ లో నావిగేషన్ వంటి ఇతర ప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్‌ను మౌంట్ చేయడానికి ప్రత్యేక స్టాండ్‌ను కూడా ఏర్పాటు చేశాడు.

శివహరే తాను తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ పై తిరగడం చూసిన నగరంలోని ప్రజలకు ఇదే విషయం హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. పేద వాళ్లకు ఎలక్ట్రిక్ బైక్ లు కొనే స్థోమత లేదని అందుకే తక్కువ బడ్జెట్ లో దీనిని రూపొందిచాలని నిర్ణయించుకున్నట్లు ఆదిత్య తెలిపారు. ప్రతీ ఒక్కరూ దీనిని కొనుక్కోగలిగేలా తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ సైకిల్ ని ఒక్కసారి మార్కెట్లోకి విడుదల చేస్తే అది విప్లవాన్ని సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఇ-సైకిల్ మోడల్ పేరు A1గా నిర్ణయించినట్లు ఆదిత్య చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే తీగలు లేకుండా కరెంటు సిద్ధం చేశానని, దీనికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ కూడా దీనిని మెచ్చుకున్నట్లు వివరించారు. ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ తనకు స్పూర్తి అని ఆదిత్య శివహరే పేర్కొన్నారు.

తన కలల ఎలక్ట్రిక్ సైకిల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాల సహాయంతో పాటు ఇతరుల నుంచి సహకారాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఆదిత్య ఆశిస్తున్నారు. తన ఉత్పత్తిని దేశంలోని నలుమూలాలకు అందించాలనేది తన ఏకైక లక్ష్యమని వివరించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 20, 2023, 18:04 [IST]
English summary
Electric bicycle developed at a cost of 20000 with 30km range by mp youth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+