దీన్ని నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.. కేవలం రూ.55 వేలకే సరికొత్త స్కూటర్ విడుదల
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు తగినట్లుగా పలు కొత్త సంస్థలు వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఆకర్షించే డిజైన్లు, అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ స్కూటర్ మిమ్మల్ని విపరీతంగా ఆకట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కూటర్‌ను డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా నడపవచ్చు దాని ప్రత్యేకతలు..
సరికొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ Yulu తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. Yulu Wynn పేరిట దీనిని సంస్థ తీసుకువచ్చింది. అందరికి అందుబాటు ధరల్లో ఈ స్కూటర్ విడుదల కానుంది. ప్రస్తుతానికి ఆన్‌లైన్ ద్వారా కేవలం రూ.999 (రిఫండ్‌బుల్) చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. మే నెల రెండో వారంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను సంస్థ డెలివరీ చేయనుంది.

Yulu Wynn 984.3Wh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఒక్క ఛార్జ్‌తో 68 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. పోర్టబుల్ ఛార్జర్‌ను ఉపయోగించి, ఇంట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. యూలు, మాగ్నా జాయింట్ వెంచర్ అయిన Yuma ఎనర్జీ నెట్‌వర్క్‌లోని ఏ బ్యాటరీ స్టేషన్‌లో అయినా కేవలం ఒక్క నిమిషంలో బ్యాటరీని మార్చుకోవచ్చని తెలిపింది.
ఈ బైక్ గరిష్టంగా 25 km/h వేగంతో ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 110mm డ్రమ్ బ్రేక్స్, ముందు - 60/100, వెనక - 80/80 టైర్లతో కూడిన 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 100 KGల వరకు బరువును మోయగలదు. కొలతల పరంగా, కొత్త యూలు వైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,630 mm పొడవు, 670 mm వెడల్పు, 1,200 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

Yulu Wynn ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కీ లెస్ ఫంక్షన్స్‌తో పనిచేస్తుంది. కీ అవసరం లేకుండా యూలు మొబైల్ యాప్ ద్వారా ఈ స్కూటర్‌ను యాక్సిస్ చేయవచ్చని సంస్థ తెలిపింది. ఈ బైక్‌ను 16 సంవత్సరాలకు పైబడిన వారు కూడా నడపొచ్చని తెలిపింది. ఇందుకు ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ గానీ రిజిస్ట్రేషన్ గానీ అవసరం లేదని వెల్లడించింది. ఈ స్కూటర్ ప్రస్తుతం scarlet red మరియు moonlight white రెండు కలర్లలోనే అందుబాటులో ఉందని సంస్థ తెలిపింది.
Yulu Wynn ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల సందర్భంగా యూలు సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం కోసం పనిచేయడం ప్రారంభించిన నుంచి తమ వినియోగదారుల నుంచి ఎన్నో అభ్యర్థనలు వచ్చినట్లు చెప్పారు. వారి కోరికమేరకే యూలు వైన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. E- స్కూటర్ విభాగంలో వినియోగదారులకు Yulu మంచి ఎంపిక అవుతుందని ఆయన వివరించారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్) CTL యాజమాన్యంలో అభివృద్ది చేసింది. మారుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని కొత్త అన్వేషణలకు చాలా అవకాశాలున్నాయని బజాబ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ అన్నారు. సులువైన మొబిలిటీని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడంలో భాగంగా యూలు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
స్కూటర్ విడుదల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ప్రారంభ ఆఫర్ కింద కేవలం రూ.55,555కే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 64,999 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. సంస్థ మొబిలిటీ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ ద్వారా ముందస్తు ధరలో సుమారు 40 శాతం వరకు తగ్గుతుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్లను కేవలం బెంగళూరుకే పరిమితం చేసినట్లు.. త్వరలోనే అన్ని ముఖ్య నగరాల్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications








