YO bykes కొత్త హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆవిష్కరణ.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 100 కి.మీ రేంజ్‌..!!

భారతీయ ఆటో మొబైల్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతం కంటే ఎక్కువ శాతం కస్టమర్లు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు వినియోగదారుల ఆసక్తి మేరకు వాహనాలను తయారీ చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ YO bykes తన ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను పరిచయం చేసింది.

100 కి.మీ రేంజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ : YO బైక్స్‌ సంస్థ ( YO bykes ) తన హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను YO TRUST Drift Hxని ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ 2.65kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 100 కి.మీ రేంజ్‌ ఇస్తుందని సంస్థ తెలిపింది. మరియు ఈ స్కూటర్‌ గరిష్ఠంగా 65kmph వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.

electric scooter yo trust drift hx

7 సెకన్లలో 65 కి.మీ వేగం : ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కేవలం 3 సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అదే 7 సెకన్లలో 65 కి.మీ వేగాన్ని అందుకోగలదని సంస్థ తెలిపింది. పట్టణ ప్రయాణికులకు ఇది మెరుగైన ఎంపిక అవుతుందని భావిస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర, ఇతర వివరాలు, ఫీచర్లను వెల్లడి కావాల్సి ఉంది.

స్థిరమైన ప్రత్యామ్నాయం..! : YO TRUST Drift Hx ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. భారత ఆటోమోటివ్‌ పరిశ్రమ మరింత స్థిరమైన భవిష్యత్‌ వైపు అడుగులను సూచిస్తుందని YO బైక్స్ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ బైక్ ఆవిష్కరణ సందర్భంగా ఈ సంస్థ సీఈవో ప్రదీప్‌ కౌడియా తమ ప్రాధాన్యాలను వివరించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో హై స్పీడ్ ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిచయం చేసేందుకు YO బైక్స్‌ సంస్థ సిద్ధమవుతోందని తెలిపారు. ఈ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడం సహా వాహనాల విక్రయాలను పెంచడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. పర్యావరణ హితమైన భవిష్యత్‌ను పెంపొందించడంలో YO బైక్స్‌ కీలక పాత్ర ఫోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది.

గతంలో పోలిస్తే అనేక సంస్థలు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై విడుదలపై దృష్టిపెడుతున్నాయి. కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలపై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అత్యధిక చోట్ల మౌలిక సదుపాయాల కొరత కారణంగా కొంత మంది వెనకడుగు వేస్తున్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు మరియు నిపుణుల కొరత వేధిస్తోంది. అయితే ఈ సమస్యలపై ప్రముఖ సంస్థలు ఇప్పటికే దృష్టిసారించాయి. దేశవ్యాప్తంగా ప్రాధాన్యత పరంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 27, 2023, 17:31 [IST]
English summary
Electric scooter yo trust drift hx in india with 100km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+