Electric Scooters హెల్మెట్ లేకున్నా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపవచ్చు..

దేశంలో టూ వీలర్‌ నడుపుతున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్‌, కారు నడుపుతున్న వారు సీటు బెల్ట్‌ ధరించాల్సిందే. లేదంటే జరిమానా సంగతి ఏమో కానీ.. ప్రమాదాలు జరిగితే ప్రాణానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. కానీ ఇక్కడ కొన్ని ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్‌ అవసరం లేదు.

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం 250w కంటే తక్కువ పవర్ మరియు 25 kmph గరిష్ఠ వేగంతో ఏదైనా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం (EV) నడుపుతున్నప్పుడు హెల్మెట్ అవసరం లేదు. మరి అంత తక్కువ పరిధిలో ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఏంటి.. ధర ఎంత అనుకుంటున్నారా.. సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు వివరాలు మీ కోసం.

Hero Electric Optima eE2

Hero Electric Optima e2 : భారతీయ మార్కెట్లో సరసమైన ధరలో లభించే స్కూటర్‌ హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా E2. పూర్తి ఛార్జింగ్‌పై 65 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీతో ప్రయాణిస్తుంది. రూ.61 వేల ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

హాప్‌ లియో స్కూటర్‌(Hop Leo Scooter) : హాప్‌ లియో స్కూటర్‌ పూర్తి ఛార్జ్‌తో 75 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గరిష్ఠంగా 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. పార్కింగ్ సెన్సార్లు, GPS సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ. 81,999 గా ఉంది.

Okinawa R30

ఒకినావా R30 స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదు. దీని బ్యాటరీ ప్యాక్ 4 నుండి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 60 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. గంటకు 25 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఆన్‌ రోడ్‌ రూ.69,998 ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.

జెమోపీ మిసో చాలా సరసమైన ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్. ఫుల్ ఛార్జింగ్‌తో 60 నుంచి 75 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. పూర్తి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. గంటకు 25 కి.మీ గరిష్ఠ వేగంతో పాటు డ్రమ్ బ్రేక్ ఎంపికను కూడా కలిగి ఉంది. రూ.44,000 ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Lohia oma star li

లోహియా ఓమా స్టార్ లి సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 60 కిమీల రేంజ్‌ను ఇస్తుంది. మరియు గరిష్ట వేగం 25 కి.మీ. ఫిరి రెడ్, మాకో బ్లాక్, స్పిరిటెడ్ గ్రే & వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఎక్స్‌షో రూమ్‌ ధర రూ.51,750 గా ఉంది.

Hero Electric Flash LX స్కూటర్ తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఫుల్ ఛార్జింగ్‌పై 85 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని బ్యాటరీ 4 నుంచి 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. 25 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ధర రూ.59,640 గా ఉంది.

Hero Electric Flash LX

Hero Electric Optima LX రూ.51,440, ఆంపియర్ రియో ​​లైట్ రూ.60,490, Komaki XGT KM రూ.56,890 మరియు ఒకినావా లైట్ రూ.64,000 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే ఏ మార్గమైనా ప్రమాదకరమే కావచ్చు. కాబట్టి మీ భద్రత కోసం హెల్మెట్ ధరించండి తప్పనిసరి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 30, 2023, 18:07 [IST]
English summary
Electric scooters in india which do not need helmets in less price details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+