ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయి.. ఆ షాకింగ్‌ నిర్ణయమే కారణమా?

గతంలో పోలిస్తే భారత్‌లో ఎలక్ట్రిక్‌ బైక్‌, స్కూటర్ల సంఖ్య పెరుగుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తయారీ సంస్థలు కూడా రకరకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఒక్కసారిగా ఎలక్ట్రిక్‌ బైక్‌ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మే నెలతో పోలిస్తే జూన్‌ నెల విక్రయాలు భారీగా తగ్గాయి.

ప్రభుత్వ వెబ్‌సైట్ వాహన్‌ ప్రకారం.. దేశంలో జూన్‌ నెలలో కేవలం 45,734 ద్విచక్ర వాహనాలు మాత్రమే విక్రయాలు జరిగినట్లు సమాచారం. అదే మే నెలలో అమ్మకాల సంఖ్య 1,05,334 గా ఉండేది. అంటే జూన్‌ నెలలో సుమారు 56.58 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు తగ్గాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

Electric two wheeler sales dropped in june

గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇచ్చేది. మే నెలలో ప్రభుత్వం ఈ సబ్సిడీపై సమీక్షించింది. మరియు రాయితీని 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సబ్సిడీ తగ్గడంతో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా జూన్‌ నెల విక్రయాలు గణనీయంగా తగ్గాయి.

గత సంవత్సరం జూన్‌ నెలలో 44,380 విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది ఆగస్టు నెలలో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ బైక్‌, స్కూటర్ల విక్రయాలు 50,000 యూనిట్ల మార్క్‌ను దాటాయి. అప్పట్లో ఓలా సహా ఇతర ప్రముఖ సంస్థ భారీ రికార్డులను సృష్టించాయి. పండుగ సీజన్‌ అక్టోబర్‌ నెలలో 75,000 పైగా యూనిట్లు విక్రయాలు జరిగాయి.

Electric two wheeler sales dropped in june

ఆ రికార్డు మార్చి 2023 నెలలో దాటింది. ఏకంగా మార్చిలో 86,283 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంతో ధరల పెరగాయి. ఫలితంగా ఓలా వంటి సంస్థ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. మే నెలతో ఓలా సంస్థ 28,629 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. అదే జూన్‌లో కేవలం 17,552 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Electric two wheeler sales dropped in june

ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీ తగ్గింపు మరియు ఓలా స్కూటర్‌ ధరల పెరుగుతల కారణంగా ఓలా S1 ఎయిర్‌ ధర రూ.1.10 లక్షలు, S1 ధర రూ.1.30 లక్షలు, S1 ప్రో రూ.1.40 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉన్నాయి. ఎస్‌1 ఈవీ 125 కిమీ రేంజ్‌ ఇస్తుంది. అదే ఎస్‌ 141 కమీ, టాప్‌ ఎండ్‌ మోడల్‌ S1 ప్రో 181 కిమీ రేంజ్‌ ఇస్తుంది.

టీవీఎస్‌ సంస్థ ద్విచక్రవాహనాల విక్రయాల్లోనూ భారీగా తగ్గుదల కనిపించింది. మే నెలలో ఈ సంస్థ 20,397 యూనిట్లను విక్రయించింది. కానీ జూన్‌లో కేవలం 7,791 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే విక్రయాల్లో సుమారు 62 శాతం క్షీణత కనిపించింది. ప్రస్తుతం iQube ధర రూ.1,23,184 ఉంది మరియు iQube S వేరియంట్‌ ధర రూ.1,38,289 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది.

Electric two wheeler sales dropped in june

బజాజ్‌ సంస్థ మే నెలలో 9,965 యూనిట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. కానీ జూన్‌ నెలలో కేవలం 2,966 వాహనాలు మాత్రమే విక్రయించింది. అంటే సుమారు 54 శాతం అమ్మకాల్లో క్షీణతను నమోదు చేసింది. ఏథర్‌ ఎనర్జీ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. మే నెలలో 15,000 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. జూన్‌లో 4,540 వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 3, 2023, 18:21 [IST]
English summary
Electric two wheeler sales dropped in june due to fame subsidy cut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+