ఆగస్టు నెలలో జోరందుకున్న ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు.. తొలి స్థానంలో ఏ సంస్థ ఉందంటే?

భారత్‌లో ఎలక్ట్రిక్‌ బైక్‌, స్కూటర్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. విక్రయాలు కూడా జోరందుకున్నాయి. ఆగస్టు నెల నివేదిక ప్రకారం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఈ విక్రయాల్లో ఓలా తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్‌ రెండో స్థానంలో ఉంది.

సాధారణంగా భారత్‌లో పండుగల సమయంలో ద్విచక్రవాహనాల విక్రయాలు గణనీయంగా ఉంటాయి. అయితే ఆగస్టు నెలలో మాత్రం సుమారుగా అన్ని సంస్థలు కూడా విక్రయాల్లో వృద్ధి సాధించాయి. FAME-2 సబ్సిడిలో కోత విధించిన తర్వాత జూన్‌, జులై నెలల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయాలు భారీగా పడిపోయాయి. అయితే ఆగస్టులో మాత్రం సుమారు 60,000 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Electric two wheeler sales improved in august

జూన్‌ 2023 నెలలో 46,027 యూనిట్లు, అదే జూలైలో 54,498 యూనిట్ల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు విక్రయాలు జరిగాయి. అయితే ఆగస్టులో మాత్రం 59,313 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 ఆగస్టులో 52,225 వాహనాలు విక్రయించారు. గత సంవత్సరంతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదు చేసింది.

ఆగస్టు నెల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఓలా సంస్థ తొలిస్థానంలో ఉంది. ఆగస్టులో 17,655 యూనిట్లను విక్రయించింది. S1 సిరీస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కోసం 75000 బుకింగ్‌లను కలిగి ఉంది. అయితే జులై నెలతో పోల్చితే కాస్త వెనుకబడింది. ఓలా సంస్థ.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో 29% వాటాను కలిగి ఉంది.

Electric two wheeler sales improved in august

సెప్టెంబర్‌ నెలలో 20,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలని ఓలా లక్ష్యం నిర్దేశించుకుంది.
ఓలా సంస్థ ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు 162,684 యూనిట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. ఓలా సంస్థ S1 సిరీస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు భారత మార్కెట్లో రూ.80,000 నుంచి రూ.1.47 లక్షల ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఆగస్టులో టీవీఎస్‌ 14,584 యూనిట్ల ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలను విక్రయించింది. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో 19 శాతం వాటాను కలిగి ఉంది. టీవీఎస్‌ సంస్థ లక్ష యూనిట్ల విక్రయ మైలురాయిని ఇటీవలే నమోదు చేసింది. టీవీఎస్‌ iQube ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కారణంగా ఈ విజయాన్ని నమోదు చేసింది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.1.20 లక్షలుగా ఉంది. 100 కి.మీ రేంజ్ ఇస్తుంది.

బెంగళూరు వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈథర్‌ ఎనర్జీ సంస్థ ఆగస్టు నెలలో 6835 యూనిట్ల ద్విచక్రవాహనాలను విక్రయించింది. జూలైలో ఈ సంస్థ 6,671 యూనిట్లను విక్రయించింది. జులై నెలలో పోలిస్తే ఆగస్టులో 2% వృద్ధిని నమోదు చేసింది. ఈథర్‌ 450S ఈవీ ధర రూ.1,29,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ స్కూటర్‌ 115 కి.మీ రేంజ్‌ ఇస్తుంది.

ఆగస్టు నెలలో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు భారీగా వృద్దిని నమోదు చేశాయి. జూలైలో 4,116 యూనిట్లను విక్రయించగా.. ఆగస్టు నెలలో 6137 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే జూలైతో పోలిస్తే ఆగస్టు నెలలో సుమారు 50 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 1, 2023, 15:51 [IST]
English summary
Electric two wheeler sales improved in august with 60000 units
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+