Elesco Scooters ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర ఐఫోన్ 14 కంటే తక్కువ..100కి.మీ రేంజ్..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకు తగినట్లుగానే పలు కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఆకర్షించే ఫీచర్లతో సరమైన ధరల్లో స్కూటర్లను తీసుకువస్తున్నాయి. టూవీలర్ మార్కెట్ లో ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఓ స్కూటర్ల వివరాలు మీకోసం...

ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఎలెస్కో ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా సరికొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి ఆ సంస్థ విడుదల చేసింది. ఇప్పటికే పలు మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న ఎలెస్కో తాజాగా ఎలెస్కో వీ1, వీ2 అనే మరో రెండు మోడల్స్ పరిచయం చేసింది. అతి తక్కువ ధరకే ఆ స్కూటర్లను తక్కువ ధరలో అందిస్తుంది.

elesco v1 scooter

పెరిగిన చమరు ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు ఇప్పుడు మొత్త ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. మొదట్లో వీటిపై వచ్చిన పేలుడుతో పాటు ఇతర రిమార్క్ లను సంస్థలు అధిగమిస్తున్నాయి. అన్నీ విధాలా తట్టుకునేలా ఈవీలను సంస్థలు రూపొందిస్తున్నాయి. ఒక్కసారి ఆ బైక్ లేదా స్కూటర్ పై చెడు ప్రభావం పడితే అది ఆ సంస్థ సేల్స్ ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందువల్ల క్వాలిటీపై దృష్టిసారిస్తున్నాయి.

తాజాగా ఎలెస్కో తీసుకువస్తున్న స్కూటర్లు కూడా మంచి ఫర్ఫామెన్స్ ని అందించే స్కూటర్లుగా పరిగణించవచ్చు. కంపెనీ కొత్తగా తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎలెస్కో వీ1, ఎలెస్కో వీ2గా సంస్థ నామకరణం చేసింది. ఈ స్కూటర్లను ఫుల్‌గా ఛార్జ్ చేయడానికి కేవలం 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఇందులో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఆధారంగా 2 గంటల్లోనే 70 నుంచి 80 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుందని సంస్థ పేర్కొంది.

రెండు స్కూటర్లు 2.3 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందనున్నాయి. వెనుక చక్రం 72V ఎలక్ట్రిక్ హబ్ మోటార్‌తో శక్తిని అందిస్తుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో డిస్క్, వెనుక డ్రమ్ తో ఈ స్కూటర్లు రానున్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక కాయిల్ స్ప్రింగ్‌లచే సస్పెన్షన్ ను వీటికి అమర్చారు.

V1 10-ఇంచెస్ చక్రాలతో రానుంది. ఇక V2 విషయానికి వస్తే పెద్ద 12-అంగుళాల ఫ్రంట్ వీల్‌ను పొందుతుంది. రెండు స్కూటర్ల లోడింగ్ కెపాసిటీ 200 కిలోల వరకు ఉంటుంది. ఎలెస్కో V2 ఎలక్ట్రిక్ మోటార్ 4 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదు. అయితే V1 మోటార్ 2.5 kW ఉత్పత్తి చేయగలదు.

రెండు స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ ఆధారంగా మొబైల్ అప్లికేషన్ కంట్రోల్, ఇంటర్నెట్ తో పనిచేసే GPS సిస్టమ్, కీలెస్ ఇగ్నిషన్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. రెండు స్కూటర్లలోని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ LED-ఆధారిత యూనిట్ తో కంపెనీ జతచేసింది. ఇంకా మరెన్నో స్మార్ట్ వైర్ లెస్ పంక్షన్స్ ఈ స్కూటర్లలో రానున్నాయి.

ఇక ఈ రెండు స్కూటర్లకు 3 సంవత్సరాల వారంటీని సంస్థ అందిస్తోంది. అయితే వారంటీ చెల్లుబాటు అయ్యే కిలోమీటర్లకు సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్ లలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్కూటర్ల ధరలు అందరికీ అందుబాటు ఉన్నాయని చెప్పవచ్చు.

ఎలెస్కో నుంచి కొత్త స్కూటర్లను మార్కెట్‌కు పరిచయం చేయడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎలెస్కో డైరెక్టర్ మన్హర్ సాహ్నీ తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్లల్లో ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా ఖర్చుతో కూడుకున్నవిగా చేయడానికి పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థిరమైన ఎలక్ట్రిక్ భవిష్యత్తును సృష్టించడానికి ఇవి రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.

వినియోగదారులకు మార్కెట్‌లో అత్యధిక నాణ్యత గల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని మరో డైరెక్టర్ రౌనక్ జునేజా ఎలెస్కో వెల్లడించారు. స్థిరత్వం, భద్రతపై ఇతర బ్రాండ్ ల కంటే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు.అందరికీ అందుబాటు ధరలో ఈ స్కూటర్లు లభించనున్నాయి. కేవలం రూ.69,999 ఎక్స్ షోరూమ్ ధరకు రెండు స్కూటర్లు అందుబాటులో ఉండనున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 17, 2023, 11:12 [IST]
English summary
Elesco v1 v2 ev scooters launched at 69999 price fetures and specification details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+