తక్కువ ధరలో అంబియర్ N8 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 200 కి.మీ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్
మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీ డిమాండ్ ఉంది. అధిక పెట్రోల్ ధరలు ఒక కారణం అయితే.. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీ తయారీదారులు సైతం పోటాపోటీగా అందుబాటులో ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఎనిగ్మా ఆటోమొబైల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంబియర్ N8 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కి.మీలు రేంజ్ ఇస్తుంది. 2 నుంచి 4 గంటల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

ఇంటర్‌సిటీ ప్రయాణికులు, అగ్రిగేటర్‌ల కోసం అంబియర్ N8ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించింది. ఈ స్కూటర్ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 వరకు అందుబాటులో ఉంది.
బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలనుకునేవారికి అంబియర్ N8 మంచి ఆప్షన్. కొనుగోలు ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడానికి కస్టమర్లు ఇప్పుడు అంబియర్ ఎన్8 స్కూటర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, వాహనానికి సంబంధించి ఎలాంటి సుదీర్ఘ లావాదేవీలు లేకుండా కస్టమర్ వివరాలను ధ్రువీకరించడం ద్వారా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది.

ఇక అంబియర్ N8 పనితీరు చూసుకుంటే ఇది శక్తివంతమైన 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. గంటకు 45 km నుంచి 50 km వేగాన్ని అందుకుంటుంది. ప్రాక్టికాలిటీ కోసం రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్‌తో సహా 200 కిలోల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది ప్రయాణీకులు మరియు కార్గో సర్వీసులకు రెండింటికీ ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.
అంబియర్ N8 విశాలమైన 26 లీటర్ బూట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాప్ కనెక్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎనిగ్మా ఆన్ కనెక్ట్ యాప్ ది. దీని ద్వారా స్కూటర్‌తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

ఇక కలర్స్ విషయానికొస్తే ఇది ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. స్టార్మ్ గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్ మరియు సిల్వర్ వంటి ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి అభిరుచికి, ప్రాధాన్యతకు అనుగుణంగా కలర్‌ను ఎంచుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీల రేంజ్‌ను అందించడం వల్ల వినియోగదారులు ఉత్సాహంగా రైడ్ చేసుకోవచ్చు.
ఎనిగ్మా ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ బోహ్రే అంబియర్ N8 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడారు. కొత్త ఉత్పత్తులను బయటకు తీసుకువచ్చేందుకు కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ మరియు సపోర్ట్ ఎంతో అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. వినియోగదారుల నమ్మకం మరియు ప్రోత్సాహంతో మరింత మెరుగైన ఫలితాలను అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంబియర్ N8 విజయం ఆధారంగా, ఎనిగ్మా ఆటోమొబైల్స్ భవిష్యత్తులో మరో వేరియంట్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఎంపికలను మరింత విస్తరించే అవకాశం ఉంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కస్టమర్ల అవసరాలు మరియు ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్టట్లు డైరెక్టర్ తెలిపారు.
అందువల్ల మీరు అందుబాటు ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ స్కూటర్‌ను పరిశీలించొచ్చు. ఎందుకంటే భారీ రేంజ్ దీని సొంతం. అలాగే దీని రేటు కూడా అందుబాటు ధరలోనే ఉంది. బడ్జెట్ ధరలో, హై రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే అంబియర్ N8 మంచి ఆప్షన్.


Click it and Unblock the Notifications








