Bikes: RX100 నుంచి R15, కరిజ్మా వరకు.. మళ్లీ విడుదల కాబోతున్న బైక్స్ ఇవే..!

కంపెనీలు విడుదల చేసే బైక్స్ లో కొన్ని చాలా స్పెషల్ గా మిగిలిపోతాయి. పలు కంపెనీలు విడుదల చేసిన పాత బైక్స్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. చూడటానికి పాతవిగా ఉన్నా జనాల్లో వాటి క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు అనుగుణంగా కంపెనీలు పలు మోడిఫికేషన్స్ చేస్తూ తీసుకువస్తున్నాయి. మళ్లీ తెరపైకి వస్తున్న బైక్స్ వివరాలు మీకోసం..

బైక్స్ లలో RX100, హీరో కరిజ్మా, యమహా R15, హోండా నవీ వంటి మోడళ్లు చాలా ఫేమస్. సినిమాల్లో వీటిని విరివిగా వినియోగించేవారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ బైక్స్ పై రైడ్ చేసేవారు. ఈ బైక్స్ కి ఇప్పటికి టూవీలర్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉందటే వీటికి ఉన్న ఆధరణ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

బైక్స్

ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఈ సామెతను మోటార్ సైకిల్ యాజమాన్యాలు అమల్లోకి తీసుకువస్తున్నాయి. ఆయా కంపెనీల నుంచి పేరొందిన బైక్స్ ని మార్కెట్ లోకి మళ్లీ తీసుకువస్తున్నాయి. అవి చూడటానికి పేరులో పాతది అయినా పర్ఫామెన్స్ లో దూసుకెళ్తాయని సంస్థలు వెల్లడించాయి. సరికొత్త టెక్నాలజీని జోడించి యువతలో ఉత్తేజాన్ని నింపడానికి ఈ బైక్స్ ని మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నాయి. ఆ జాబితా ఇక్కడ చూడండి.

RX100

RX100..
RX100 ఈ పేరు చెప్తే చాలు యువతకు పూనకాలే వస్తాయి. పేరులోనే ఏదో తెలియని సౌండింగ్ ఉంటుంది అంటారు కుర్రకారు. 98cc 2-స్ట్రోక్ ఇంజన్ నుంచి వచ్చే శబ్దానికి కోట్లలో అభిమానులు ఉన్నారంటే అతియోశక్తి కాదు. ఈ తేలికైన వేగవంతమైన బైక్ ఆ కాలంలో చాలా వేగంగా పరుగెత్తే బైక్ గా ప్రసిద్ధి చెందింది. దీని సిగ్నేచర్ సౌండ్ 'రింగ్-డింగ్-డింగ్'కి ఉన్న క్రేజ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే.

ఈ బైక్ పై వెళ్తుంటే జనాలు అలా చూస్తు నివ్వెర పోతారు. కుర్రకారు మనసును దోచేసిన ఈ బైక్ మరోసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి యమహా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. BS6 నియమాలకు లోబడి అత్యాధునిక సాంకేతికతో ఈ బైక్ రానుంది.

హీరో కరిజ్మా

హీరో కరిజ్మా..
కరీజ్మా విడుదలైన సందర్భంలో దేశంలో టూవీలర్ యుగంలో ఓ కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు. ఆ బైక్ డిజైన్, పవర్ పర్ఫామెన్స్ యువకులను కట్టిపడేసింది. 17PS పవర్ గల ఈ బైక్ 19Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఆ కాలంలో అందుబాటు ధరలో ఇంత అవుట్‌పుట్ పవర్ ఇచ్చే ఏకైక బైక్ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు కొత్త డిజైన్, లిక్విడ్-కూల్డ్ మోడ్ లో కరిజ్మాను హీరో కంపెనీ రీలాంఛ్ చేయనుంది.

యమహా R3

యమహా R3..
యమహా R3 దీనికి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. చూడటానికి ఆకర్షనీయంగా కనిపించే ఈ బైక్ ప్రయాణానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ బైక్ ధర 2015 రూ 3.25 లక్షలు (ఎక్స్ షో రూం ఢిల్లీ) ధర ఉంది. అంటే ఓ ప్రీమియం బైక్ లా దీనిని భావించే వారు. BS6 నియమాలను పాటించడంలో ఈ బైక్ ఫెయిల్ అవడంతో 2020 లో భారతీయ మార్కెట్ నుంచి కేంద్రం తొలగించింది. మరోసారి ఈ బైక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

హోండా నవీ..
హోండా నవీ స్కూటర్‌ చురుకైన ఇంజిన్‌ సైకల్‌ లాంటి డిజైన్‌తో రైడర్లకు కొత్త అనుభవాన్ని అందించిందని చెప్పవచ్చు. దీని పెప్పి మోటారు, వేగవంతమైన నిర్వహణ బైకాగి ప్రజాదరణ పొందింది. దీనిని యువకులు మరియు స్వేచ్ఛగా ఉండేందుకు ఉద్దేశించలేదు. ఒక ప్రత్యేక విభాగం కోసం నిర్మించబడింది. ఈ మినీ బైక్‌ని మళ్లీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, హోండా తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది.

హోండా నవీ

దాని పెప్పీ మోటారు, అతి చురుకైన హ్యాండ్లింగ్ నవీని ఒక ఆహ్లాదకరమైన బైక్‌గా మార్చాయి. సులభంగా హద్దులు దాటి మూస పద్ధతులను ఈ బైక్ బద్దలు కొట్టింది. అసాధారణమైన మినీ బైక్‌గా ఇది నిలిచింది. ఈ చిన్న బైక్ ని తిరిగి తీసుకురావాలని హోండా నిర్ణయించుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ బైక్ వస్తే ఎక్కువ మంది కొనుగోలుదారులను పొందే అవకాశం ఉంటుంది.

యమహా R15..
యమహా R15తో పరిచయం అక్కర్లేని పేరు. ఈ బైక్ చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఇది 149cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ని కలిగి ఉంది. 17.1PS వద్ద 14.4Nm టార్క్ ను అందిస్తుంది. 2016 లో మోటార్‌ సైకిల్ పూర్తిగా నిలిపి వేయబడింది. 2023 లో ఈ బైక్ అందుబాటులోకి రానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 28, 2023, 9:20 [IST]
English summary
Famous bikes like rx100 karizma yamaha r15 and many more re launching in india details in telugu
Read more on: #బైక్స్ #bikes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+