దేశంలో ఈ కంపెనీల E-సైకిళ్లు చాలా ఫేమస్.. ఓసారి కొన్నారంటే ఫిదా అవుతారు..
అప్పట్లో ఏ చిన్న అవసరానికైన మనకు వెంటనే గుర్తొచ్చే వాహనం సైకిల్. నేడు ఎన్ని బైక్స్, కారులు మార్కెట్ లోకి వచ్చిన వీటికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. E-సైకిల్ మార్కెట్ అనేది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మార్కెట్ గా అవతరించింది. అలాంటి సైకిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీలు మన దేశంలో చాలా పెరిగాయి. తక్కువ ధరలో ఆధునాతన సైకిళ్లను అందిస్తున్న కంపెనీలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైకిల్ తయారీదారుగా భారత్ నిలిచింది. ప్రతి సంవత్సరం1.5 కోట్ల యూనిట్లు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. మార్కెట్ రీసెర్చ్.కమ్ నివేదిక ప్రకారం 2022లో 11.44 మిలియన్ యూనిట్ల సైకిళ్లు అమ్ముడు అయ్యాయని పేర్కొంది. 2027 నాటికి ఈ సంఖ్య 14.43 మిలియన్ యూనిట్లకు చేరుతుందని నివేదిక తెలిపింది.

ఎగుమతుల్లో 2వ స్థానం..
చైనా, భారత్, వియత్నాం దేశాలు సైకిల్ ఉత్పత్తి టాప్ 3 ఎగుమతిదారులుగా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో 8.49%గా ఉంది. 2027 చివరి నాటికి అది 9.71%కి పెరుగుతుందని అంచనా వేసింది. ఈ పరిశ్రమను ఐదు ఉత్పత్తి విభాగాలుగా విభజించవచ్చు. స్టాండర్డ్, ప్రీమియం, పిల్లల, ఇ-బైక్, ఎగుమతుల సైకిళ్లుగా ఉన్నాయి.
పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు సైకిల్ వైపు జనాలు చూస్తున్నారు. ఇతర వాహనాలతో పోలిస్తే పర్యావరణ హాని రహిత వాహనం కావడంతో సైకిలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ప్రముఖ నగరాల్లో కొనసాగుతోంది. తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా కావడం ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరల వల్ల సైకిల్ మార్కెట్ వృద్ధి చెందుతుందని సంస్థ తెలిపింది.

E- మోటోరాడ్
2020లో EMotorad (EM) అనే సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తి కేంద్రాన్ని పూణెలో స్థాపించింది. సాహస యాత్రికులు, రోజువారీ ప్రయాణీకులు, సాధారణ రైడర్ ల కోసం ఇ-బైక్ లలో పాటు సైకిళ్లను తయారు చేస్తుంది. దేశంలో ఇ-బైక్ లను ప్రోత్సహించేలా అధునాతన సాంకేతికను జోడించి వీటిని సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిళ్లను దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి సంస్థ పనిచేస్తోంది. జపాన్, యూఏఈ, యూరప్, నేపాల్ దేశాల్లో తమ వ్యాపారాన్ని మోటోరాడ్ విస్తరించింది. భారతదేశంలో 160+ డీలర్ షిప్ లు, భారతదేశంతో పాటు విదేశాలలో 82 పట్టణాలు నగరాల్లో వీటి స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి.
హీరో లెక్ట్రో..
ఈ సంస్థ నవంబర్ 2018 నుంచి దేశంలో ఇ-బైక్ అమ్మకాలను ప్రారంభించింది. E-సైకిల్ శ్రేణిలో హీరో లెక్ట్రో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా గేర్ లతో పాటు గేర్ లెస్ సైకిళ్లను సహా 8 రకాల వేరియంట్ లను ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత స్మార్ట్ ఇ-మొబిలిటీ విభాగంలో హీరో లెక్ట్రో ప్రాధాన్యం కల్పిస్తుంది. పరిశుభ్రత, వ్యక్తిగత భద్రత, శారీరక దృఢత్వం, వంటి ఆధునాతన ఫీచర్లపై హీరో దృష్టి సారిస్తుంది.
మోటోవోల్ట్..
మోటోవోల్ట్ ను 2020లో తుషార్ చౌదరి అనే వ్యక్తి స్థాపించారు. ఈయన కోల్‌కతాకు చెందిన హిమాద్రి గ్రూప్ ఆఫ్ కంపెనీల మాజీ ప్రమోటర్. ఇది స్పెషాలిటీ కెమికల్స్ ను తయారు చేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం, స్టార్ట్-అప్ ఇ-సైకిల్ లను ప్రారంభించింది. పాన్-ఇండియా స్థాయిలో ఈ కంపెనీ బైక్ లు గుర్తింపు పొందుతున్నాయి. భారతదేశంలో ఇ-మొబిలిటీ విప్లవాన్ని ప్రేరేపించేలా పనిచేస్తున్నామని సంస్థ తెలిపింది.

గేర్ హెడ్ మోటార్స్
హైదరాబాద్ కు చెందిన గేర్ హెడ్ మోటార్స్, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ వినూత్నమైన ఎలక్ట్రిక్ సైకిళ్లు, ట్రై సైకిళ్లను అందింస్తోంది. EV పరిశ్రమకు గొప్ప పరిచయంతో, కంపెనీ మార్కెట్ ప్రమాణాలకు చేరుకుంది.
నైన్టీ వన్ సైకిల్స్
అహ్మదాబాద్‌కు చెందిన నైన్టీ వన్ సైకిల్స్ దేశంలోని ప్రత్యేక ఇంజనీరింగ్ సైకిళ్లకు పేరుగాంచింది. నేడు, ఈ బ్రాండ్ 300 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించి ఉంది.
VAAN ఎలక్ట్రిక్ మోటో
వాన్ ఎలక్ట్రిక్ మోటో ప్రైవేట్ ఇది భారతీయుల కోసం ఇ-బైక్ లను తయారు చేస్తుంది. VAAN Moto 2021లో ప్రవేశపెట్టబడింది. కేరళ (మల్టీ-బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్‌లు), తమిళనాడులోని కోయంబత్తూర్ (మల్టీ-బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్), ముంబై దాని ప్రధాన కార్యాలయాల్లో షోరూమ్ లను కలిగి ఉంది. అహ్మదాబాద్ కు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ స్విచ్ బైక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టిన సరికొత్త కంపెనీ. స్విచ్ భారతీయ ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్‌కు అనుగుణంగా ప్రత్యేకమైన డిజైన్ లు ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తుంది.


Click it and Unblock the Notifications








