2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలు మాత్రమే కాకుండా ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టాప్ ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్:

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సుజుకి మోటార్‌సైకిల్‌ 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ ప్రదర్శించింది. సుజుకి మోటార్‌సైకిల్‌ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ప్రదర్శనతో ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలో చేరిపోయింది. ఈ బైక్ 249 సిసి, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 9,300 rpm వద్ద 26.14 bhp గరిష్ట పవర్ మరియు 7,300 rpm వద్ద 22.2 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

పరిమాణం పరంగా కూడా ఈ కొత్త సుజుకి Gixxer 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 2,010 మిమీ పొడవు, 805 మిమీ వెడల్పు, 1,035 మిమీ ఎత్తు మరియు 1,340 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే సుజుకి Gixxer 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి, 156 కేజీల బరువును కలిగి ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్:

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన 'పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్' ని 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ బైక్ 160.37 సిసి ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,000 rpm వద్ద 14.6 bhp పవర్ మరియు 8,500 rpm వద్ద 12.5 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ పొడవు 2017 మిమీ, వెడల్పు 804 మిమీ, ఎత్తు 1060 మిమీ మరియు వీల్‌బేస్‌ 1372 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్:

దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రదర్శించింది. ఈ బైక్ 159.7 సిసి ఆయిల్-కూల్డ్, SOHC ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 9250 ఆర్‌పిఎమ్ వద్ద 17.39 బిహెచ్‌పి పవర్ మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ పొడవు 2035 మిమీ, వెడల్పు 790 మిమీ, ఎత్తు 1050 మిమీ మరియు వీల్‌బేస్‌ 1357 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు 275 కేజీల వరకు ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్:

యమహా మోటార్‌సైకిల్ ఆటో ఎక్స్‌పో 2023 లో 'యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్' (Yamaha FZ-15 ABS) ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ 149 సిసి, సింగిల్ సిలిండర్, SOHC 2 వాల్వ్ 4 స్ట్రోక్ ఇంజిన్ పెట్రోల్‌ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 12.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ బైకులు - ఇక్కడ చూడండి

యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ పొడవు 2000 మిమీ, వెడల్పు 780 మిమీ, ఎత్తు 1080 మిమీ మరియు వీల్‌బేస్‌ 1330 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క బరువు (కర్బ్ వెయిట్) 135 కేజీల వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, January 15, 2023, 8:00 [IST]
English summary
Flex fuel motorcycle showcased at auto expo 2023 details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+