అదిరిపోయే ఫీచర్లతో కొత్త L2.0 ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను విడుదల చేసిన గేర్‌ హెడ్‌.. 30 కి.మీ రేంజ్‌

ఎలక్ట్రిక్‌ వాహనాలకు కస్టమర్లలో రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఎకో ఫ్రెండ్లీగా ఉండేందుకు ఆటో కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్‌ కార్లు, టూవీలర్లను రూపొందిస్తున్నారు. తాజాగా టూవీలర్‌ లైనప్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ EV టెక్నాలజీ కంపెనీ Gear Head Motors చేరింది. గేర్‌ హెడ్‌ మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను విడుదల చేసింది.

గేర్ హెడ్‌ మోటార్స్‌ తన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ L2.0 (L 2.0) సిరీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ ఫ్రెండ్లీ ధరలో ఈ సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ధర రూ. 24,999. ఈ సైకిల్‌లో 250-వోల్ట్ GHM మోటార్‌ను అమర్చారు.

Gear-Head-L2.0-Electric-Cycle

కొత్త L2.0 సైకిల్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 కి.మీల రేంజ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. అయితే ఇందులో బ్యాటరీ ఛార్జ్‌ అయిపోయినప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెడల్స్‌ సాయంతో మీరు ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను నడపొచ్చు.

గేర్ హెడ్ L2.0 సిరీస్ ఎలక్ట్రిక్ సైకిల్‌తో 3 amp ఫాస్ట్ ఛార్జర్‌ను కంపెనీ అందిస్తుంది. ఇంకా కేవలం 2 గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ కొత్త ఇ-సైకిల్ 36V 6Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇ-కటాఫ్ టెక్నాలజీతో కూడిన డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కూడా ఇందులో చూడవచ్చు.

Gear-Head-L2.0-Electric-Cycle

మీరు ఈ L2.0 ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను నడుపుతున్నప్పుడు బ్రేక్‌ వేసినట్లయితే మోటారు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ డిజైన్‌ను పరిశీలిస్తే ఇందులో LED లైట్లు, ఫ్రంట్‌ టెలిస్కోపిక్ ఫోర్క్, 27.5 అంగుళాల టైర్లతో ఆకర్షణీయంగా ఉంది. అంతేకాకుండా ఈ సైకిల్ కార్బన్ స్టీల్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ సైకిల్‌పై మీరు గరిష్ఠంగా 25 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు.

కొత్త గేర్‌ హెడ్‌ L2.0 సైకిల్‌ కొనుగోలు చేయడం ద్వారా స్పెషల్‌ అడ్వాంటేజ్‌ ఏంటంటే.. దీన్ని డస్ట్‌ అండ్‌ వాటర్‌ ప్రూఫ్‌గా రూపొందించారు. ఈ సైకిల్‌పై నీరు, దుమ్ము పడినా పాడవకుండా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీని ద్వారా కస్టమర్లలో విశ్వసనీయత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కొత్త L2.0 ఎలక్ట్రిక్‌ సైకిల్‌ బరువు 22 కిలోలు మాత్రమే. ఇది రెండు ఆకర్షణీయమైన కలర్స్‌ రెడ్ మరియు స్కై బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. గేర్ హెడ్ మోటార్స్ కంపెనీ ఎల్2.0 ఎలక్ట్రిక్ సైకిల్ ఫ్రేమ్‌పై మీకు జీవితకాలం వారంటీని అందిస్తోంది. అయితే, బ్యాటరీ ప్యాక్‌ను మాత్రం 2.5 సంవత్సరాల వారంటీతో అందించారు.

కొత్త L2.0 సైకిల్‌ మేక్‌ ఇన్‌ ఇండియా సైకిల్‌ అని 85 శాతం కంటే ఎక్కువ భాగాలను స్థానికంగా తయారుచేసినట్లు గేర్‌ హెడ్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా పేర్కొన్నారు. ఈ సైకిల్‌ కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ విద్యార్థులు లేదా నగరాల్లో నివసిస్తూ చిన్న చిన్న అవసరాలు ఉండే వారికి ఈ సైకిల్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పవచ్చు.

ఎలాంటి రోడ్లపై అయినా సరే ఈ L2.0 సైకిల్‌ చాలా సులువుగా వెళ్లేలా కంపెనీ దీనిని రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను అన్ని రకాల సైకిల్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చింది. పర్యావరణ అనుకూల రవాణాను కోరుకునే పట్టణ ప్రయాణికులు, బహిరంగ సైక్లింగ్ ఔత్సాహికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 27, 2023, 16:46 [IST]
English summary
Gear head launches l2 0 electric cycle at low price features and range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+