గొగోరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ.. కమర్షియల్ అవసరాల కోసం బెస్ట్ ఆప్షన్..111 కి.మీ రేంజ్!!
తైవాన్‌కి చెందిన గొగోరో అనే సంస్థ భారత్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఆవిష్కరించింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న మొదటి స్కూటర్ క్రాస్‌ఓవర్ GX 250 అనే వేరియంట్‌తో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. ఆఫ్‌రోడ్, ఆన్‌రోడ్ సామర్థ్యంతో దీనిని రూపొందించామని సంస్థ వెల్లడించింది.
గొగోరో క్రాసోవర్ భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనునున్నాయి. గోగోరో క్రాసోవర్ GX 250, క్రాసోవర్ 50 మరియు క్రాసోవర్ S అనే మూడు వేరియంట్లలో లభించనుంది. ప్రస్తుతం GX 250 వెంటనే భారతదేశంలో 2024 ప్రథమార్ధంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. క్రాసోవర్ 50 మరియు క్రాసోవర్ ఎస్ 2024 ద్వితియార్ధంలో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టనున్నాయి. ఈ స్కూటర్లు బ్రాండ్ ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించబడతాయి.

గొగోరో క్రాసోవర్ ప్రస్తుతం ఉన్న స్కూటర్ల కంటే భిన్నంగా ఒక ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉంది. టూ-వీలర్‌లో ఓ ఎస్‌యూవీగా పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడిఫైడ్ స్టీల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఆధారంగా రూపొందించబడింది. ఈవీ యొక్క ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను ఈవీ భిన్న రూపాన్ని కలిగి ఉంటుంది. పూర్తి స్టైలిష్డ్ లుక్‌తో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.
ఈ ఎలక్ట్రిక్ వాహనం టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు ట్విన్ రియర్ షాక్ లతో వస్తుంది. ఈ స్కూటర్ వేగాన్ని నియంత్రించడానికి డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ 220 mm డిస్క్, రియర్ ఎండ్ 180 mm డిస్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పిల్ట్-సీట్ డిజైన్‌తో వస్తుంది. అంతే కాకుండా రైడర్ కోసం బ్యాక్ రెస్ట్ ఉపయోగించడానికి వెనుక సీటును మడతపెట్టుకునే సదుపాయం కూడా ఉంది.

ఈ స్కూటర్ వెనుక భాగంలో భారీ కార్గో స్పేస్‌తో వస్తుంది. ఇది వేరు చేస్తే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ను రైడర్లు అధిక మొత్తంలో లగేజీని తరలించేందుకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ ఉపయోగం కోసం ఈ స్కూటర్‌ని ఓ మంచి ఆప్షన్‌గా పరిగణించవచ్చు. గోగోరో క్రాసోవర్ GX 250లో 2.5 కిలోవాట్ల డైరెక్ట్ డ్రైవ్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 60 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 111 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ని అందిస్తుంది.
క్రాసోవర్ 50లో 5 కిలోవాట్ల బ్యాటరీ, క్రాసోవర్ S లో 6.4 కిలోవాట్ల బ్యాటరీ, 7 కిలోవాట్ల బ్యాటరీ ఉంటుంది. భారతదేశంలో పెరుగుతున్న వ్యాపారాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని లాజిస్టిక్స్, డెలివరీ ఫ్లీట్‌లు మరియు టాక్సీ సేవల కోసం కొత్త మొబిలిటీ సొల్యూషన్స్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా నిలువనుంది. ఇంధనంతో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా క్రాసోవర్ GX250 మంచి ఆప్షన్ అని కంపెనీ తెలిపింది.

బ్యాటరీ మార్పిడి: ఈ స్కూటర్‌లోని మరో ఆప్షన్ ఏంటంటే కేవలం సెకన్లలో బ్యాటరీలను మార్చుకోవచ్చు. దీని ద్వారా చేరాల్సిన గమ్యం విషయంలో రైడర్ ఎటువంటి ఆందోళన చెందకుండా సహకరిస్తుంది. గొగోరో బ్యాటరీ ఎక్స్ఛేంజ్ ఒక న్యూ జనరేషన్ బ్యాటరీ సిస్టమ్. ఇది రైడర్‌లు, వ్యాపారాలు మరియు కమ్యూనిటీలకు స్మార్ట్, సురక్షితమైన, డైనమిక్ ఇంకా అన్ని విధాలా ఉపయోగపడనుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








