Harley Davidson X440 డెలివరీలపై సంస్థ కీలక ప్రకటన.. బుకింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేత..!

హీరో మోటార్స్‌ భాగస్వామ్యంతో హార్లే డేవిడ్‌సన్‌ X440 రోడ్‌స్టర్‌ బైక్‌లను జులైలో విడుదల చేసింది. జులై 4న ఈ బైక్‌ల బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు X440 బైక్‌ల కోసం 25 వేల బుకింగ్‌ వచ్చినట్లు సంస్థ ఇటీవల వెల్లడించింది. ఇందులో 65 శాతం వరకు టాప్‌ఎండ్‌ ఎస్‌ వేరియంట్‌ బుకింగ్‌లు ఉన్నట్లు తెలిపింది.

అయితే ఈ బైక్‌లు బుకింగ్‌ చేసుకున్న వారికి సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. హార్లే డేవిడ్‌సన్‌ X440 (Harley Davidson X440) రోడ్‌స్టర్ బుకింగ్‌ చేసుకున్న వారికి అక్టోబర్‌ 2023 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని సంస్థ వెల్లడించింది. సంస్థ వెబ్‌సైట్‌ లేదా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా టెస్ట్‌ రైడ్‌ను షెడ్యూల్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Harley Davidson X440 roadster

ఈ బైక్‌ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపేసింది. తొలి బ్యాచ్‌ డెలివరీలు పూర్తయిన తర్వాత మళ్లీ బుకింగ్‌లు ప్రారంభిస్తామని వెల్లడించింది. డిమాండ్‌కు అనుగుణంగా హార్లే డేవిడ్‌సన్‌ X440 రోడ్‌స్టర్‌ బైక్‌ల ఉత్పత్తిని పెంచుతున్నట్లు హీరో సంస్థ వెల్లడించింది. రాజస్థాన్‌లోని హీరో తయారీ ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తోంది.

హార్లే డేవిడ్‌సన్‌ X440 బైక్‌ డెనిమ్‌, వివిడ్‌, ఎస్‌ వేరియంట్లలో లభిస్తుంది. డెనిమ్‌ వేరియంట్ ధర రూ.2.29 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. వివిడ్‌ వేరియంట్‌ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూం), ఎస్‌ వేరియంట్‌ ధర రూ.2.69 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. కొత్తగా బుకింగ్‌ చేసుకొనే వారు ఇటీవల పెరిగిన ధర రూ.10,500ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Harley Davidson X440 roadster

హార్లే డేవిడ్‌సన్‌ X440 రోడ్‌స్టర్‌ బైక్‌ 440cc 2 వాల్వ్‌ సింగిల్ సిలిండర్‌ ఎయిర్‌- ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 27.6bhp శక్తి, 38Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ స్లిప్పర్‌ అసిస్ట్‌ క్లచ్‌తో కూడిన 6- స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

హార్లీ డేవిడ్‌సన్‌ X440 పొడవైన ఇంధన ట్యాంక్‌ మరియు పాలిష్‌ చేయబడిన వెనుక భాగం మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. హెడ్‌లైట్లు, ఇండికేటర్లు వంటివి వృత్తాకారంలో ఉంటాయి. ఇవి మోటార్‌సైకిల్‌ను మరింత స్టైలిష్‌గా ఉంచుతున్నాయి. మస్టర్డ్‌ డెనిమ్‌, మెటాలిక్‌ డార్క్‌ సిల్వర్‌, మెటాలిక్‌ థిక్‌ సిల్వర్‌, మ్యాటీ బ్లాక్‌ రంగుల్లో లభ్యం కానుంది. మస్టర్డ్‌ డెనిమ్‌, మ్యాటీ బ్లాక్ రంగులు కేవలం డెనిమ్‌, ఎస్‌ వేరియంట్లు మాత్రమే కలిగి ఉంటాయి.

Harley Davidson X440 roadster

ఈ బైక్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, టాప్ ఎండ్‌ వేరియంట్‌లో TFT స్క్రీన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, డ్యూయల్‌ ఛానల్‌ ABS, LED లైటింగ్‌తోపాటు ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో టాకోమీటర్‌, ట్రిప్‌ మీటర్లు, ఓడోమీటర్‌, సర్వీస్‌ ఇండికేటర్‌, సైడ్‌ స్టాండ్‌ అలర్ట్‌ వంటి ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంది.

హార్లే డెవిడ్‌సన్‌ X440 రోడ్‌స్టర్‌ బైక్‌ 43mm డ్యూయల్‌ కార్ట్రిడ్జ్‌ అప్‌ సైడ్‌ డౌన్ ఫోర్క్‌లను కలిగి ఉంది. వెనుక వైపు 7 స్టెప్‌ ప్రీలోడ్‌ అడ్జస్టబుల్‌ గ్యాస్‌ ట్వీన్‌ షాక్‌ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు 320mm డిస్క్‌ బ్రేక్‌లు, వెనుకవైపు 240mm డిస్క్‌ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్‌ ఛానల్‌ ABSతో వస్తుంది.

Harley Davidson X440 roadster

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 5, 2023, 17:34 [IST]
English summary
Harley davidson x440 roadster deliveries start from october 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+