నవంబర్‌ 7 న హీరో ‘మ్యాక్సీ' స్కూటర్‌ ఆవిష్కరణ.. ADV స్టైల్‌లో హోండా యాక్టివాకు గట్టి పోటీగా నిలవనుందా.??

దేశీయ మార్కెట్లో హోండా మోటార్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) టూవీలర్‌ విభాగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ బ్రాండ్‌లో యాక్టివా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌ అని సందేహం లేకుండా చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళల నుంచి ఈ స్కూటర్‌కు భారీ డిమాండ్‌ ఉంది. స్టైలిష్‌ లుక్‌తో పాటు మెరుగైన, స్టాండర్డ్‌ పనితీరుతో కస్టమర్ల ఫేవరెట్‌గా ఉంది.

హోండా యాక్టివాను సవాల్‌ చేస్తూ గట్టి పోటీగా నిలిచేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు వివిధ మోడళ్లలో స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. అయినప్పటికీ యాక్టివాకు ఉన్న ప్రజాదరణ, వేగవంతమైన సేల్స్‌తో ఇతర కంపెనీలు పోటీ పడలేకపోతున్నాయి. కాగా హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్ బైక్‌తో హోండాకు గట్టి పోటీని ఇస్తోంది.

Hero-ADV-Maxi-Scooter

అయితే హోండాతో పోటీని మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా హీరో మోటోకార్ప్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం త్వరలో కొన్ని కొత్త ద్విచక్ర వాహనాలను హీరో మోటోకార్ప్‌ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు హీరో సంస్థ.. మంగళవారం ఆటో ఎక్స్‌పో షోలో కొన్ని కొత్త ద్విచక్ర వాహనాలను పరిచయం చేయనుంది.

ఈ విషయాన్ని హీరో కంపెనీ ప్రకటించింది. అయితే ఈ సమాచారానికి సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను బట్టి చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కొత్త ADV స్టైల్‌ Maxi స్కూటర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్రాండ్‌లో కొత్త మ్యాక్సీ స్కూటర్ రాబోతుందని హీరో మోటోకార్ప్‌ టీజర్‌ ద్వారా తెలుస్తోంది.

Hero-ADV-Maxi-Scooter

మంగళవారం(నవంబర్‌ 7న) తొలిసారిగా ఈ స్కూటర్‌ ఆవిష్కరణ కానుంది. ఇంతకు ముందెప్పుడూ ఈ మ్యాక్సీ మోడల్‌ను విడుదల చేయకపోవడం గమనార్హం. దీని తరువాత, Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో కూడా ప్రదర్శించింది.

విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హీరో కంపెనీ త్వరలో విదేశాల్లో అమ్మకానికి తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారతీయుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ ఈ వాహనానికి అదే ఆదరణ లభించే అవకాశాలున్నాయి. అయితే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Hero-ADV-Maxi-Scooter

కొత్త ద్విచక్ర వాహనాలను మాత్రమే EICMA షోలో ప్రారంభించనున్నట్లు మాత్రమే హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. EICMA ఆటో షో ఇటలీలోని మిలన్‌లో రేపటి నుంచి నవంబర్ 12 వరకు జరగనున్నట్లు తెలిపింది. Hero MotoCorp వంటి అనేక అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు తమ రాబోయే ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఈ వరల్డ్‌ ఫేమస్‌ ఆటో షో గొప్ప అవకాశం.

అయితే దేశంలో మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్‌లో కొన్ని వాహనాల మోడల్‌లు మాత్రమే మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. BMW C400 GT, Honda ATV150, Honda Forshaw 300, 22 Kymco X-Town 300i, Yamaha Aerox, Aprilia SXR 160, Aprilia SXR 125, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ రైడ్ స్కూటర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 6, 2023, 21:27 [IST]
English summary
Hero adv maxi scooter to be unveiled at eicma here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+