హీరో నుంచి పవర్ ఫుల్ E-స్కూటర్స్ విడుదల.. ఆ మచ్చ తొలగిపోనుందని సంస్థ వెల్లడి..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త EV రాక పెరుగుతోంది. హీరో ఎలక్ట్రిక్ ఎట్టకేలకు తన కొత్త స్మార్ట్ కనెక్ట్ చేయబడిన ఆప్టిమా CX, NYX ఎలక్ట్రిక్ మోడళ్లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా ఆ సంస్థ నుంచి తీసుకువచ్చిన ఈ స్కూటర్స్ వివరాలు మీకోసం...
ఆప్టిమా CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), ఆప్టిమా CX2.0 (సింగిల్ బ్యాటరీ), NYX CX5.0 (డ్యూయల్ బ్యాటరీ) అనే మూడు కొత్త స్కూటర్లను కంపెనీ పరిచయం చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు అధునాతన సాంకేతికతో ఈ స్కూటర్లను సంస్థ ప్రవేశ పెట్టింది. మొత్తం ఈ స్కూటర్స్ లో తీసుకువచ్చిన వివిధ అంశాలతో పాటు ఇతర విషయాలు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.

సరసమైన ధరల్లో..
ఈ స్కూటర్ల ధరల విషయానికొస్తే, హీరో ఎలక్ట్రిక్ కంఫర్ట్, సిటీ స్పీడ్ స్కూటర్ల ధర రూ. 85 వేలు, రూ. 95 వేలు రూ. 1,05,000, రూ. 1,30,000 ధర పరిధిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వివిధ సిటీలను బట్టి ఈ స్కూటర్ల ధరలు మారనున్నాయి.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లపై సాఫీగా ప్రయాణించేందుకు అత్యాధునిక జపనీస్ మోటార్ టెక్నాలజీలతో వీటిని సంస్థ తీసుకువచ్చింది. దేశీయ వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా జర్మన్ ECU సాంకేతికతను ఈ స్కూటర్లకు జోడించారు. ICE ఇంజిన్ స్కూటర్‌ల డిజైన్ ఆకర్షణీయమైన లుక్‌లో చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను ఈ స్కూటర్స్ కలిగి ఉన్నాయి.
55కి.మీ వేగంతో ప్రయాణం..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, ఈథర్, టీవీఎస్ ఐక్యూబ్ ఇతర ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఇవి పోటీపడనున్నాయి. Optima CX5.0 3 kWh C5 Li-ion బ్యాటరీతో ఆధారితమైనది. ఇది 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో గరిష్టంగా 55 kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఏకకాలంలో ఈ స్కూటర్ చార్జింగ్ కావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.
ఇక Optima CX2.0 విషయానికొస్తే. ఇది గరిష్టంగా 48 kmph వేగంతో దూసుకెళ్తుంది. Optima CX5.0 వంటి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందిస్తుంది. దీన్ని 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. వేగంతో పాటు అన్నీ విధాల కస్టమర్ కు నచ్చేలా, సులభంగా ఈ స్కూటర్ పై ప్రయాణించేలా ప్రత్యేకంగా వీటిని రూపొందించింది.

భద్రతా ఫీచర్లలో భేష్..
మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ సేఫ్టీ అలర్ట్, డ్రైవ్ మోడ్ లాక్, రివర్స్ రోల్ ప్రొటెక్షన్, సైడ్ స్టాండ్ సెన్సార్లు వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇక కలర్ల విషయానికి వస్తే Optima CX5.0 డార్క్ మ్యాట్ బ్లూ, మ్యాట్ మెరూన్ రంగులలో లభిస్తుంది. అలాగే Optima CX2.0 డార్క్ మ్యాట్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్‌లో అందించబడుతుంది. NYX CX5.0 చార్‌కోల్ బ్లాక్, పెరల్ వైట్ కలర్లలో సంస్థ తీసుకువచ్చింది.
ఆరు లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో కొత్త శ్రేణి EVలను రూపొందించినట్లు హీరో ఎలక్ట్రిక్ యొక్క CEO సోహిందర్ గిల్ పేర్కొన్నారు. కొత్త మోడళ్లలో 'హైబర్నేటింగ్ బ్యాటరీ టెక్నాలజీ' తో పాటు ''డైనమిక్‌గా సింక్రొనైజ్డ్ పవర్‌ట్రెయిన్' వంటి ఫీచర్లు ఉన్నాయని గిల్ తెలిపారు. కొత్త స్కూటర్లు 'డబ్బుకి తగిన నిజమైన విలువ' మోటోతో కస్టమర్ల కోసం మంచి సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామి ఇచ్చారు.

ఇతర కంపెనీలకు సవాల్..
కొత్తగా ప్రారంభించబడిన ప్రతి ఉత్పత్తి కస్టమర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేసినవేనని ఆయన అన్నారు. దేశంలో పెరుగుతున్న EVల డిమాండ్‌ను తీర్చడానికి మా భాగస్వాములతో కలిసి సంవత్సరానికి 1 మిలియన్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని దానికి గర్విస్తున్నామని వివరించారు. ఈ స్కూటర్స్ కచ్చితంగా వినియోగదారుల మనసులు దోచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా హీరో తన స్కూటర్లను భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ఓలా, ఈథర్ సహా పలు కొత్త కంపెనీల స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు హీరో తన కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లతో ఎంతవరకు తమ మోడల్స్ ని సక్సెస్ పంథాలో నడిపిస్తాయో వేచి చూడాలి. పోటీదారుల నుంచి గట్టి పోటీని మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications








