హీరో నుంచి మరో కొత్త EV స్కూటర్.. అందుబాటులోకి వచ్చేది ఆ రోజే..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగం రోజు రోజుకూ పెరిగిపోతోంది. వీటిని ఉపయోగించే వారి సంఖ్య పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాపులర్ కంపెనీల దగ్గర నుంచి, చిన్న కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' ఒక కొత్త స్కూటర్ విడుదల చేయనుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

త్వరలోనే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయనున్నట్లు ఆ కంపెనీ ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆప్టిమాను పోలి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మార్చి 15న ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు సమాచారం.

హీరో ఎలక్ట్రిక్

అద్భుతమైన ఫీచర్లతో రానున్న సరికొత్త EV..

ఈ సరికొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ కౌల్ పైభాగంలో ఉంచబడిన LED హెడ్‌ ల్యాంప్‌ ఆకర్షణీయంగా ఉండనుంది. దానికి సెంటర్ లో LED టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. ఇవి బైక్ కి క్రేజీ లుక్ ను ఇవ్వనుంది. హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్ డిజైన్ ఫ్రంట్ కౌల్ లు అచ్చం హీరో ఆప్టిమా లా రానున్నాయి.

అల్లాయ్ వీల్స్ తో కూడిన ఈ స్కూటర్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో రానుంది. కర్వీ సీట్, గ్రాబ్ రైల్, బ్లూ పెయింట్ థీమ్‌ తో కూడిన అల్లాయ్ వీల్స్‌తో ఈ బైక్ ఆకర్షిస్తోంది. కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

తగ్గిన సేల్స్ అందుకే ఆచితూచి అడుగులు..

ఈ ఏడాది ఫిబ్రవరిలో, హీరో ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో 5,861 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరిలో 6,393 యూనిట్లను కొనుగోలు చేయగా తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, హీరో ఎలక్ట్రిక్ మొత్తం 80,954 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. FAME-II స్కీమ్ సబ్సిడీ ప్రకారం ఈ వెహికిల్స్ లభించనున్నాయి.

ఇప్పటికే కంపెనీ ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు రాబోయే మోడల్ 8 వదిగా ఉంది. అలానే చాలా ఎలక్ట్రిక్ సంస్థలు పోటాపోటీగా వాహనాలను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి. దేశంలో సంప్రదాయ ఇంధన వాహనాలకు కాలం చెల్లుతోంది. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అవుతుండటం గమనార్హం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాయితీలను కల్పిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో EVల ట్రెండ్ కనిపిస్తోంది.

భారీగా పెరుగుతన్న EVల వినియోగం..

ఇకపై పూర్తి పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు రోడ్లపై తిరుగనున్నాయి. ఇండియాలో ఎక్కువ రేంజ్ ను కలిగిన స్కూటర్ గా బ్రిస్క్ సంస్థ చరిత్ర సృష్టించనుంది. ఒక్క చార్జ్ తో ఏకంగా 333 కిలోమీటర్ల రేంజ్ వరకు దీనిపై ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ to విజయవాడకు సింగల్ ఛార్జ్ తో వెళ్లవచ్చు. హైదరాబాద్ లో తాజాగా ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు.

ప్రస్తుతం వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో బూట్ స్పేస్ (సీటు కింది భాగం) కూడా ఎక్కువగా ఉండనుంది. మోటార్‌ సైకిళ్ల కంటే స్కూటర్‌ లను చాలామంది ఎక్కువగా ఇష్టపడటానికి బూట్ స్పేస్ ఒక ముఖ్య కారణం. కంఫర్ట్ కోసం ఎక్కువ మంది స్కూటీలను మాత్రమే కొనుగోలు చేస్తారు. ఇలా అన్నీ కోణాలలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగిపోతుంది.


More from DriveSpark

Article Published On: Monday, March 13, 2023, 13:41 [IST]
English summary
Hero electric teases new electric scooter will expect debut on march 15
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+