అందరి ఫేవరెట్ హీరో గ్లామర్ మళ్లీ వచ్చిందోచ్.. 63 కి.మీ మైలేజ్, ధర రూ. 82,348..!!

దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. మంచి మైలేజ్, అధునాతన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న హీరో కంపెనీ మార్కెట్లోకి సరసమైన ధరలో అప్‌డేటెడ్ 2023 గ్లామర్(2023 Glamour Bike) బైక్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

అప్‌డేటెడ్ 2023 హీరో గ్లామర్ దేశీయ మార్కెట్లో గురువారం విడుదల అయింది. ఈ హీరో గ్లామర్ బైక్ పవర్ ట్రైన్ విషయానికొస్తే ఇందులో 125 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7,500 rpm వద్ద గరిష్ఠంగా 10.68 bhp శక్తిని మరియు 6,000 rpm వద్ద 10.6 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా i3Sలో ఐడిల్ స్టాప్/స్టార్ట్ బటన్ ఉంది.

Hero-Glamour-2023

ఇంకా కొత్త గ్లామర్ బైక్ OBD2 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయబడిన ఇంజిన్‌తో వస్తుంది. ఈ బై్ E20 (80% పెట్రోల్ మరియు 20%)కి సపోర్ట్ ఇస్తుంది. హీరో గ్లామర్ మైలేజ్ విషయంలో కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేయవచ్చు. ఇది లీటరుకు 63 కి.మీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ బైక్ టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125, హోండా షైన్ మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది.

కొత్త హీరో గ్లామర్ బైక్‌లో యువ కస్టమర్లను ఆకట్టుకునే డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇది కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, తక్కువ ఇంధన సూచికతో సహా వివిధ రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో USB ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది.

Hero-Glamour-2023

ఇంకా లుక్ పరంగా చూసుకుంటే కొత్త గ్లామర్‌ను మరింత ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్‌ని రూపొందించారు. హీరో కంపెనీ ఈ బైక్ యొక్క రైడర్ మరియు పివిలియన్ సీట్ ఎత్తును వరుసగా 8mm & 17mmకు తగ్గించింది. గ్లామర్ లాంచ్‌తో దేశీయ మార్కెట్లో కంపెనీ 125 సిసి లైనప్ మరింత బలోపేతం అవుతుందని.. అమ్మకాల పరిమాణం మెరుగుపడుతుందని హీరో మోటోకార్ప్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ అన్నారు.

కాగా ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. డ్రమ్ మరియు డిస్క్ వేరియంట్‌లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. డ్రమ్ వేరియంట్ రూ. 82,348, డిస్క్ వేరియంట్ రూ. 86,348 ఎక్స్-షోరూమ్ ధరలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్ మరియు స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Hero-Glamour-2023

అయితే హీరో కంపెనీ కొత్త తరం కరిజ్మా XMR బైక్‌ను ఆగస్టు 29న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించి అన్ని రకాల సన్నాహాలు జరిగాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా టీజర్లను పంచుకోవడం ద్వారా కొంత సమాచారం వెల్లడించింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.90 లక్షల నుంచి రూ.2.10 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

కొత్త కరిజ్మా XMR బైక్ 210 cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికతో లభ్యమయ్యే అవకాశం ఉంది. 32.8 kmpl మైలేజ్ అందిస్తుందని అంచనా. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీతో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 25, 2023, 8:24 [IST]
English summary
Hero glamour 2023 bike launched with 63 km mileage price specs features full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+