Hero Karizma XMR హీరో కరిష్మా XMR బైక్ ఫుల్ రివ్యూ వీడియో
హీరో కంపెనీ తన పాత హీరో కరిష్మాను కరిష్మా XMR అనే కొత్త వెర్షన్లో విడుదల చేసింది. ఈ కొత్త హీరో కరిష్మా XMR తన బ్యాడ్జ్‌ని కొత్త స్థాయికి తీసుకువెళుతుందా.? తెలుసుకోవడానికి, మేము కొత్త Hero Karizma XMRని ఢిల్లీ రోడ్లపై నడిపాం. ఇక్కడ ఈ బైక్ యొక్క పూర్తి రివ్యూ వీడియోను ఇక్కడ చూడవచ్చు.
డిజైన్: యువతను అట్రాక్ట్ చేసే విధంగా దీనిని రూపొందించారు. కొత్త హీరో కరిష్మా XMR ను ఒక్కసారి చూస్తే దాని పాత తరం మోడల్‌కు ఎంత భిన్నంగా ఉందో తెలుస్తుంది. మొదటి కరిష్మా హోండా డిజైన్ అయితే.. కొత్త మోడల్ ZMR, R లైనప్‌లకు అప్‌డేటెడ్‌గా ఉంది. ఇందులో క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్, బ్రాంజ్ ఇంజిన్ హైలైట్‌లు, 14-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్ సెటప్, స్టబ్బి ఎగ్జాస్ట్ మరియు స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్‌తో కూడిన టైట్ టెయిల్ సెక్షన్ ఉన్నాయి.
ఫీచర్లు: ఇక కరిష్మా XMRలో ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. LCD బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది. మీరు మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు ఇన్‌కమింగ్ కాల్/SMS అలర్ట్స్‌ను ఇస్తుంది ఈ సెగ్మెంట్‌లో ఇలాంటి ఫీచర్ రావడం ఇదే మొదటిది. మీ ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవడానికి వేగంగా ఛార్జింగ్ అయ్యే USB పోర్ట్ కూడా అందించింది.

ఇంజిన్: హీరో కరిష్మా XMR సరికొత్త లిక్విడ్-కూల్డ్ 210cc, DOHC సింగిల్-సిలిండర్, ఫోర్-వాల్వ్ ఇంజిన్‌తో శక్తిని పొందింది. ఈ హై-రివింగ్ సింగిల్ 9,250rpm వద్ద 25.15bhp మరియు 7,250rpm వద్ద 20.4Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మీరు లాంగ్ జర్నీ చేయలానుకుంటే కొత్త కరిష్మా XMR ద్వారా మంచి రైడ్‌ను ఆస్వాదించవచ్చు. సాఫ్ట్ సీటు మంచిగా కుషన్‌తో పొందుపరిచి ఉంటుంది.


Click it and Unblock the Notifications








