Hero కరిజ్మా XMR 210 బైక్‌ విడుదల.. అద్భుతమైన డిజైన్‌, ఫీచర్లు..!

దేశీయ మార్కెట్‌లో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా ఉన్న హీరో.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Hero Karizma XMR 210 బైక్‌ను భారత్‌ లాంచ్ చేసింది. పాత మోడల్‌ కరిజ్మా బైక్‌ విడుదలైన సుమారు 20 సంవత్సరాల తర్వాత కరిజ్మా XMR విడుదల అయింది. అయితే కొత్త బైక్‌ డిజైన్‌ సహా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

హీరో కరిజ్మా XMR 210 బైక్‌ లిక్విడ్‌ కూల్డ్, DOHC 210cc సింగిల్‌ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 9,250 rpm వద్ద 25.1bhp శక్తి, 7,250 rpm వద్ద 20.4Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్‌, అసిస్ట్‌ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది శక్తిని వెనుక వెనుక చక్రాలకు పంపుతుంది.

Hero karizma XMR bike launched

హీరో కొత్త బైక్‌ భద్రత, సస్పెన్షన్‌ పరంగా మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌తో కూడిన స్టీల్‌ ట్రెల్లిస్‌ ఫ్రేమ్‌ సెటప్‌, వెనుక వైపు మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. భద్రత కోసం డ్యూయల్‌ ఛానల్‌ ABSతో ముందు, వెనుక వైపు డిస్క్‌ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. ఈ బైక్‌ 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

హీరో పాత కరిజ్మా బైక్‌ కంటే కరిజ్మా XMR 210 బైక్‌ ఎంతో భిన్నంగా ఉంటుంది. పుల్‌ ఫెయిర్డ్‌ సెటప్‌తో వస్తుంది. ఈ బైక్‌ డిజైన్‌ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌ ముందు భాగంలో Y ఆకారపు LED DRLతో కూడిన వెడల్పైన యాంగిలర్‌ LED హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. హ్యాండిల్‌బార్‌ పైన కాకుండా ఫెయిరింగ్‌పైన విండ్‌ స్క్రీన్‌, రియర్‌ వ్యూ మిర్రర్‌లు అమర్చబడి ఉంటాయి.

Hero karizma XMR bike launched

హీరో కరిజ్మా XMR 210 మస్క్యులర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ మరియు స్ప్లిట్‌ సీట్‌ సెటప్‌ ఉంటుంది. దీంతోపాటు క్లిప్‌ ఆన్‌ హ్యాండిల్‌ బార్‌ సెట్‌, ఎగ్జాస్ట్‌, స్లిమ్‌ రియర్‌ LED లైటింగ్ సెటప్‌ను కలిగి ఉంది. XMR 210 బైక్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీతో పుల్‌ డిజిటల్‌ LCD ఇన్స్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

కరిజ్మా XMR 210 బైక్‌ ప్రారంభ ధర రూ.1,72,900 (ఎక్స్‌షోరూం)గా ఉంది. అందుబాటు ధర కారణంగా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ బైక్‌ మూడు రంగుల్లో లభిస్తుంది. ఐకానిక్‌ ఎల్లో, టర్బోరెడ్‌, మ్యాట్‌ ఫాంట్‌ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.

Hero karizma XMR bike launched

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 29, 2023, 17:54 [IST]
English summary
Hero karizma xmr bike launched at rs172900 specs and features in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+