హీరో కరిజ్మా XMR బైక్ డెలివరీలు ప్రారంభం.. ఏంటీ బైక్ ప్రత్యేకత?
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో నుంచి కరిజ్మా అప్‌గ్రేడ్ వెర్షన్‌గా XMR బైక్ విడుదల అయింది. ఈ కొత్త బైక్ 13000 బుకింగ్‌లను నమోదుచేసుకుంది. ప్రస్తుతం ఈ బైక్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి.
తొలి బైక్ ఇదే : హీరో కరిజ్మా XMR బైక్ ధర రూ.1,72,900తో విడుదల అయింది. అనంతరం బైక్ రేట్లను హీరో సంస్థ పెంచింది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.1,79,900గా (ఎక్స్‌షోరూం) ఉంది. త్వరలో ఈ బైక్ కొత్త బుకింగ్ విండోను తెరవనున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో సంస్థలో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగిన తొలి బైక్‌గా కరిజ్మా XMR నిలిచింది. ఈ బైక్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి.

హీరో కరిజ్మా XMR (Hero Karizma XMR) మోటార్ సైకిల్ 210cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 9250rpm వద్ద 25.15bhp శక్తి, 7250 rpm వద్ద 20.4Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో జతచేయబడింది.
ఆకర్షణీయమైన డిజైన్ : ఈ బైక్ ముందు భాగంలో Y ఆకారపు LED DRL, ఆకర్షణీయమైన LED హెడ్‌లైట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సర్దుబాటుచేసుకొనే విధంగా విండ్ స్క్రీన్, మెరుగైన ఇంధన ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్ సహా అధునాతన LED లైటింగ్ వ్యవస్థను పొందుతుంది.

హీరో కరిజ్మా XMR బైక్ మూడు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఐకానిక్ ఎల్లో, టర్బోరెడ్ మరియు మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్ సహా పలు కీలక ఫీచర్లను కలిగి ఉంది.
మెరుగైన సస్పెన్షన్, బ్రేకింగ్ : ఈ బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సెటప్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను కలిగి ఉంది. దీంతోపాటు ఆకర్షణీయమైన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

హీరో కర్మిజా తొలి బైక్ 2000 సంవత్సరంలో విడుదల అయింది. అప్‌గ్రేడ్ వెర్షన్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కరిజ్మా బైక్ బైక్ తిరిగి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. పాత మోడల్ కంటే XMR మోడల్ మరింత అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







