సాధారణ ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida.. స్కూటర్ డెలివరీ ఫొటోస్

గత సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి హీరో మోటోకార్ప్ యొక్క 'విడా'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇటీవల హీరో మోటోకార్ప్ ఛైర్మన్ బెంగుళూరులోని కస్టమర్‌కు మొట్టమొదటి 'హీరో విడా వి1' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డెలివరీ చేశారు.

కస్టమర్లను ఎంతగానో ఆకర్శించిన ఈ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా హీరో మోటోకార్ప్ ఛైర్మన్ మరియు CEO అయిన డాక్టర్ 'పవన్ ముంజాల్' ని కూడా ఎంతగానో ఆకర్శించింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల పవన్ ముంజాల్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెలివరీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida

హీరో మోటోకార్ప్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ రోజు ఆరంజ్ కలర్ రోజు, మా చైర్మన్ మరియు CEO డా. పవన్ ముంజాల్ మరియు శ్రీమతి అనీషా ముంజాల్ విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేసుకున్నారు, అని చెప్పుకొచ్చింది. మొత్తానికి మోటోకార్ప్ ఛైర్మన్ కూడా విడా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో మంచి బుకింగ్స్ పొంది మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'హీరో విడా' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒకటి 'విడా వి1 ప్రో' కాగా, మరొకటి 'విడా వి1 ప్లస్'. వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.

హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎల్ఈడీ లైటింగ్, ఫాలో మీ హోమ్ హెడ్లాంప్, కీలెస్ ఎంట్రీ, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి వాటితో పాటు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఇందులో పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. దీని కెపాసిటీ 26-లీటర్ల వరకు ఉంటుంది. ఇది స్ప్లిట్ సీటుని పొందుతుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

హీరో Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. ఇక Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165-కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2-సెకన్లలో గంటకు 0-40 కిమీ వరకు వేగవతం అవుతుంది.

హీరో మోటోకార్ప్ కంపెనీ విడా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బ్యాటరీ మీద వరుసగా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ మరియు 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు బజాజ్ చేతక్ వంటి వాటిక ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇటీవల హీరో మోటోకార్ప్ కంపెనీ బెంగుళూరులో విడా యొక్క మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించారు. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ 8,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో Vida V1 స్కూటర్‌లు, ఛార్జింగ్ స్టేషన్స్ మరియు కస్టమర్లను ఆకర్శించే ఇంటరాక్టివ్ వాల్ మొదలైనవి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీ మరియు జైపూర్ వంటి నగరాల్లో కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Hero motocorp ceo pawan munjal takes vida v1 electric scooter delivery
Story first published: Friday, January 20, 2023, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X