హీరో మోటోకార్ప్‌ "గిఫ్ట్‌" ఫెస్టివల్‌ ప్రోగ్రాం.. "ఆధార్‌ కార్డు" ఉంటే చాలు EMIలో బైక్స్‌ కొనుగోలు చేయవచ్చు

గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్ (గిఫ్ట్) కార్యక్రమానికి హీరో మోటోకార్ప్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు, కొత్త కలర్ స్కీమ్స్, ఫైనాన్స్ స్కీమ్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభించనున్నాయి.

ప్రతీ ఏటా పండుగ సీజన్ ప్రారంభం అవ్వగానే హీరో మోటోకార్ప్ తన మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. టూవీలర్‌ రంగంలో కింగ్‌ మేకర్‌గా ఉన్న హీరో సంస్థ.. ఈ పండుగ సీజన్‌ ద్వారా 'గిఫ్ట్‌' అనే కార్యక్రమంతో అనేక ప్రయోజనాలను తయారీదారు నుంచి నేరుగా కస్టమర్లకు అందించనుంది. సొంత బైక్‌ కొనుగోలుతో పాటు మరెన్నో అదనపు లాభాలను కస్టమర్లు పొందవచ్చు.

Hero-Motocorp-Gift-Scheme

వరుసగా ఇది రెండవ ఎడిషన్‌ కావడం గమనార్హం. ఈ స్కీమ్‌లో భాగంగా పర్ల్ వైట్ సిల్వర్‌ కలర్‌ (Pearl White Silver)లో జూమ్‌XL, మ్యాట్టె వెర్నియర్ గ్రే (Matter Vernier Grey) లో ప్లెజర్‌ LX, టీల్ బ్లూ (Teal Blue), మ్యాట్ బ్లాక్ (Matte Balck) కలర్‌ ఆప్షన్లలో ప్లెజర్ CX వంటి పాపులర్ మోడళ్లు కొత్త కలర్‌లలో అందుబాటులోకి రానున్నాయి.

కంపెనీకి మంచి సేల్స్‌ సాధించి పెట్టే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కోసం సరికొత్త కలర్‌ ట్రిమ్స్‌ (వీల్‌ చుట్టూ) కాన్వాస్ స్ట్రిప్ ట్రిమ్స్‌తో రానుంది. సూపర్ స్ప్లెండర్ Xtec కోసం కొత్త మ‌్యాట్‌ నెక్సస్ బ్లూ ట్రిమ్ మరియు స్ప్లెండర్ + మరియు స్ల్పెండర్ + కొత్త కోసం కొత్త ట్రిమ్‌లను ప్రవేశపెట్టింది.

Hero-Motocorp-Gift-Scheme

ప్యాషన్ ప్లస్, ప్యాషన్ Xtec లు బ్లాక్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే వేరియంట్లలో లభిస్తాయి. ఈ ఎడిషన్‌లో భాగంగా ప్రత్యేక కలర్లలో బైక్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్లెజర్ VX మ్యాట్ బ్లాక్ మరియు పర్ల్ సిల్వర్ వైట్ వేరియంట్లలో కూడా లభిస్తుంది. ఇంకా అదనపు Xtec మరియు ఇతర బైకులు సైతం ఈ పండుగ సేల్‌లో సరికొత్త కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి.

లిమిటెడ్‌ ఎడిషన్‌లో లభించే ఈ సరికొత్త కలర్‌ టూవీలర్స్‌ని పొందాలంటే దగ్గర్లోని షోరూమ్‌ల్లో వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు హీరో మోటోకార్ప్ గిఫ్ట్ ప్రోగ్రామ్ కింద కస్టమర్లకు అనేక రకాల ఫైనాన్స్ స్కీమ్‌లనును అందిస్తోంది. రూ.5,500 వరకు క్యాష్ బోనస్, రూ.3,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 'బై నౌ, పే ఇన్ 2024' అనే అద్భుతమైన ఫైనాన్స్ స్కీమ్‌లను కస్టమర్లు పొందవచ్చు.

Hero-Motocorp-Gift-Scheme

కస్టమర్లు 6.99% తక్కువ వడ్డీ రేటుతో, ఎటువంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండా, ఆధార్ ఆధారిత లోన్‌ ద్వారా బైక్‌లను వెంట తీసుకువెళ్లవచ్చు. నగదు ఈఎంఐల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పండుగ ఆఫర్‌లపై హీరో మోటోకార్ప్‌ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ స్పందించారు.

కస్టమర్‌లు తమపై ఉంచిన నమ్మకాన్ని గుర్తుచేసుకోవడానికి హీరో గిఫ్ట్ ప్రోగ్రామ్ కృతజ్ఞతా కార్యక్రమంగా దీనిని అభివర్ణించారు. దేశంలో చాలా ఇష్టపడే బ్రాండ్‌గా హీరో మోటోకార్ప్ ఎదిగిందని తమ కస్టమర్‌లకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. GIFT ప్రోగ్రామ్ ద్వారా, ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు మరియు తక్కువ-వడ్డీ రేట్లతో మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రంజీవ్‌జిత్‌ తెలిపారు.

ఫెస్టివ్‌ సీజన్‌ ఆరంభంలో ఐకానిక్ హీరో ఉత్పత్తులను కస్టమర్లకు అందించేందుకు కృషిచేస్తున్నట్లు రంజీవ్‌ జిత్‌ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం హీరో మోటార్స్ ఉత్పత్తులను మరింత శక్తివంతంగా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త బైక్‌ కొనాలనుకునేవారు హీరో మోటార్స్ అందిస్తున్న ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, October 20, 2023, 19:09 [IST]
English summary
Hero motocorp gift scheme provides big cash discount and exchange bonuses
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+