మళ్లీ వస్తున్న హీరో కరిజ్మా.. ఇక ధూమ్మఛాలే ధూమ్మఛాలే ధూం..

మళ్లీ వస్తున్న హీరో కరిజ్మా.. ఇక ధూమ్మఛాలే ధూమ్మఛాలే ధూం..భారత్ లో మోటర్ సైకిల్ తయారీదారులు పాత మోడళ్లకే జై కొడుతున్నాయి. గత నెలలో బజాజ్ తన సక్సెస్ ఫుల్ బైక్ పల్సర్ ని మళ్లీ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హీరో మోటోకార్ప్ కూడా తమ సంస్థకు మంచి సేల్స్ సంపాదించి పెట్టిన కరిజ్మాను తిరిగి ప్రవేశ పెట్టనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

అత్యంత జనాధరణ పొందిన ఏ ఉత్తత్తి అయినా లేదా పరికరమైనా సరే ఆ కంపెనీకి మంచి గుర్తింపుని తీసుకువస్తాయి. అలానే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చిన కరిజ్మా బైక్ చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఈ బైక్ పై వెళ్తున్న సీన్స్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. ఈ మోడల్ బైక్ ని సరికొత్త లుక్ లో రీలాంచ్ చేయనుంది.

హీరో కరిజ్మా

కొత్త వెర్షన్ లో..

2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో OG కరిజ్మా R, కరిజ్మా ZMR సిరీస్ బైక్స్ ని హీరో తీసుకువచ్చింది. ఇప్పుడు కొత్త లిక్విడ్-కూల్డ్ 210cc ఇంజన్‌తో బైక్స్ ని తీసుకువస్తుంది. ఈ సెగ్మెంట్ లో పల్సర్ వంటి అధునాతన బైక్స్ కి ఈ సరికొత్త కరిజ్మా గట్టి పోటీని ఇవ్వనుంది.

ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లు అన్నీ EBR (ఎరిక్ బుల్ రేసింగ్)తో తయారు చేస్తారు. ఈ మోడల్ ని నిలిపివేసిన అనంతంర హీరో తన Xtreme 200S బైక్ ని లాంఛ్ చేసింది. కరిజ్మా స్థానంలో తీసుకువచ్చిన ఈ బైక్ అంతగా జనాలను ఆకర్షించడంలో చితికిలపడిపోయింది. దీంతో వాటిని సంస్థ నిలిపివేసింది. తాజాగా హీరో నుంచి రాబోయే కరిజ్మా మోడల్ ఈ సెగ్మెంట్ బైక్స్ లో సరికొత్త అధ్యాయనానికి తెరతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

హీరో కరిజ్మా

ఇంజన్..

ఈ అధునాతన కరిజ్మా 210cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. దీనిపై కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. OG కరిజ్మా సిరీస్ నుంచి దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సరసమైన ధరలో ఈ బైక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రధాన పోటీదారుల నుంచి నిలదొక్కుకునేందుకు అందుబాటు ధరలో ఈ బైక్ ఉండనుంది.

సరికొత్త కరిజ్మాలో USD ఫోర్క్‌లు, స్లిప్పర్ క్లచ్, రైడ్-బై-వైర్ వంటి మరెన్నో ఫీచర్లను అందించనుంది. డ్యూయల్-ఛానల్ ABSతో ఈ బైక్ రానుంది. అలానే రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉండనున్నాయి. ఇంకా డిజైన్ పరంగా హార్డ్ వేర్ వంటి బయటి ఫీచర్లను సంస్థ తగ్గించనుంది.

హీరో

సరికొత్త టెక్నాలజీ ఫీచర్స్..

ఎల్‌ఈడీ లైటింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంజిన్ కట్ ఆఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. 6-స్పీడ్ గేర్‌బాక్స్, ఆయిల్-కూలింగ్, USD ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ఎలిమెంట్‌లు రానున్నాయి. హీరో మోటోకార్ప్ లో ఇదే మొదటి బైక్ కానుంది. అతి త్వరలోనే కొత్త కరిజ్మాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. 2024 కరిజ్మా ధర రూ. 1.5 లక్షల రేంజ్‌లో ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

హీరో Xpulse 200లో వచ్చే ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్‌ గా ఉంది. ఈ ఇంజన్ 25 bhpతో 30 Nm శక్తిని కలిగి ఉంది. Hero Xpulse కి అనుగుణంగా కొత్త 210cc ఇంజన్‌ను మార్కెట్లోకి రానుంది. ఒక్కసారి ఈ బైక్ విడుదల అయితే కచ్చితంగా సవాల్ విసురుతుందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నరు.


More from DriveSpark

Article Published On: Friday, March 24, 2023, 12:31 [IST]
English summary
Hero motocorp planning to launch 2024 karizma with 210cc here the details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+