హీరో మోటోకార్ప్ సంచలనం.. జీరో మోటార్స్ తో జట్టు..

దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లను ఉత్పత్తి చేసేందుకు US ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ తయారీదారు జీరో మోటార్‌ సైకిల్స్‌ తో జట్టు కట్టనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది. దేశ వ్యాప్తంగా హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, ఉత్పత్తులపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది అని చెప్పవచ్చు.

దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్‌ మోటర్‌ సైకిళ్లు తయారు చేయడంలో బాగా పేరొందిన జీరో మోటార్ సైకిల్స్‌ సంస్థతో ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా.. ప్రీమియం ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల తయారీలో హీరో సంస్థకు సహకారం అందనుంది. దేశీయంగా ఈ బైక్ కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

 హీరో మోటోకార్ప్

ప్రీమియం స్కూటర్ గా ఎదిగేందుకు..

సెప్టెంబరు 2022లో జీరో మోటార్‌ సైకిల్స్‌ లో హీరో మోటోకార్ప్ $60 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడి అనంతరం భారత్ లో జీరో మోటార్స్ ను విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. తమకు ఉన్న భారీ డీలర్‌ షిప్ నెట్‌వర్క్ ద్వారా భారత్ లో జీరో మోటార్స్ కు మంచి మార్కెట్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంతో తాజాగా US కంపెనీ తన ఉత్పత్తులను భారతదేశంలో స్థానికంగా తయారు చేయనుంది.

స్థిరమైన క్లీన్ మొబిలిటీ సాంకేతికత యుగానికి ఈ ఒప్పందం నాంది పలికిందని హీరో మోటోకార్ప్ ఛైర్మన్ CEO పవన్ ముంజాల్ తెలిపారు. క్లీన్ టెక్నాలజీ యుగంలోకి ప్రవేశించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. జీరో మా భాగస్వామితో, భారతదేశంతో పాటు గ్లోబల్ మార్కెట్‌ లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగవంతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నామని ముంజాల్ చెప్పారు.

హీరో మోటోకార్ప్ బైక్

దేశంలో నిలదొక్కుకునేలా..

జీరో మోటార్‌సైకిల్స్ CEO అయిన శామ్ పాస్చెల్ మాట్లాడుతూ, రైడింగ్ అనుభవాన్ని మార్చడానికి ప్రపంచానికి విశేషమైన వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావడానికి రెండు కంపెనీలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. "ఈ భాగస్వామ్య అభిరుచులతో, మా కస్టమర్‌ లకు అసాధారణమైన విలువ, పనితీరు వినోదాన్ని అందించడానికి మేము ఎదురుచూస్తున్నామని చెప్పారు.

అయితే రెండు కంపెనీలలో తదుపరి తమ ఉత్పత్తి వ్యూహం గురించి ఏమీ వెల్లడించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Vida V1ని కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి స్వదేశీ బ్రాండ్ ప్రవేశాన్ని గుర్తించింది.

హీరో

తొలి ప్రీమియం స్కూటర్ తో ఆకర్షణ..

హీరో విడుదల చేసిన విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ.1.59 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్, ఓకినావా, బౌన్స్, టీవీఎస్ హీరో ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ కంపెనీల స్కూటర్లతో పోటీ పడుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీల నుంచి విడుదలైన స్కూటర్లు రోడ్లపై దుమ్ము రేపుతున్నాయి.

ఎంట్రీ-లెవల్ విడా V1 ప్లస్ గంటకు 80 కి.మీల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. 3.44kWh బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే ఇది సింగిల్ ఛార్జ్‌ పై 143 కి.మీల రేంజ్ వరకు వస్తుంది. ఇక 3.94kWh బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే V1 ప్రో కూడా అదే స్పీడ్‌తో వెళ్తుంది. ఈ స్కూటర్ 165 కిమీల రేంజ్ అందిస్తుంది. ఈ కంపెనీ నుంచి ప్రీమియం మోడళ్లలో వచ్చిన స్కూటర్లు ఇవే కావడం విశేషం.

More from DriveSpark

Article Published On: Tuesday, March 7, 2023, 14:04 [IST]
English summary
Hero motocorp tie up with zero motorcycles to develop premium electric vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+