భారీ షాకింగ్.. బైక్స్ ధరల్నీ పెంచేసిన హీరో.. ఈ నెలలో కొనేవారికి కాస్త ఊరట..

దేశంలో హీరో మోటాకార్ప్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టూవీలర్ విభాగంలో ఈ సంస్థ టాప్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా కొన్ని ఎంపిక చేయబడిన మోడల్ మోటర్ సైకిళ్లలో ఇప్పటికి ఈ బైక్స్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఓ సరికొత్త నిర్ణయంతో ఈ కంపెనీ కస్టమర్లకు షాక్ ఇవ్వనుంది. ఆ వివరాలు మీకోసం..

దేశంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటాకార్ప్ (Hero MotoCorp) వాహన కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చింది. ఏప్రిల్‌ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. కేంద్రం తాజాగా నూతన ఉద్గార నిబంధనలను తీసుకువచ్చింది. అందులో భాగంగా ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హీరో తెలిపింది. హీరో మోటోకార్ప్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్‌షోరూమ్‌ ధరలు పెరగనున్నాయి.

హీరో మోటోకార్ప్

పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమలు..

ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. మోడల్‌ను బట్టి, మార్కెట్‌ను బట్టి పెంపు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. బీఎస్‌-6 ఫేజ్‌-2 ఉద్గార ప్రమాణాలను పాటించడం తప్పనిసరి చేయడం ఈ పెంపుదలకు కారణమని సంస్థ వివరించింది. దీనికి కస్టమర్లు సహకరించాలని కోరింది.

మోడల్ మార్కెట్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో ధర పెంపు ఉంటుందని సంస్థ చెప్పింది. ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి వినియోగదారులకు వినూత్న ఫైనాన్సింగ్ ద్వారా ధరల్ని తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సదుపాయం వల్ల కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. అలానే డీలర్స్ ఇవ్వనున్న ఆఫర్స్ తో కొంత మేర పాక్షికంగా ఊరట లభించినట్లు అవుతుంది.

హీరో

కోలుకుంటున్న రంగం..

కోవిడ్ మహమ్మారి కారణంగా ద్విచక్ర వాహన రంగం కుదేలైంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఈ రంగం కోలుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తయారీదారులు ఆశించిన ఫలితాలను రాబట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా డిమాండ్‌ పెరిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఈ సంవత్సరం టూ వీలర్ అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.

మోడళ్లకు సంబంధించి, హీరో ఇటీవలే జూమ్ 110 స్కూటర్‌ను పరిచయం చేసింది. 110 cc స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్త సాంకేతికతతో దీనిని తీసుకువస్తోంది. అలానే Hero Splendor XTEC కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రారంభించబడింది. కంపెనీ మోడల్స్ అన్నీ ఏప్రిల్ నుండి తాజా ఉద్గార నిబంధనలకు మారుతాయి.

2-3 శాతం పెరిగే అవకాశం..

125 సీసీ సెగ్మెంట్ లో తీసుకువచ్చిన హీరో సూపర్ స్ప్లెండర్ XTEC నూతన ఉద్గార నిబంధన ఆధారంగా రూపొందించారు. దీని డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర 83,368లుగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 87,268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనుంది. ఉద్గార నిబంధనల నేపథ్యంలో మోడల్‌ను బట్టి 2-3 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది.

గతేడాది డిసెంబర్‌లో కూడా హీరో తన వాహన ధరలను పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇతర కంపెనీలు కొత్త ఉద్గార ప్రమాణాలను అందుకునేందుకు తమ వాహనాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ సరికొత్త మార్పులతో వాహనాలు ఎప్పటికప్పుడు ఎంతెంత ఉద్గారాలు విడుదల చేస్తున్నాయో తెలుసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగం రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో వీటిని ఉపయోగించే వారి సంఖ్య పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. దీనిని దృష్టిలో 'హీరో ఎలక్ట్రిక్' సరికొత్త స్కూటర్ లను కూడా తీసుకువస్తుంది. ఇంధన వాహనాలకు ధీటుగా వీటిని సంస్థ రూపొందిస్తుంది. అయితే వీటి ధరల్లో ఇలాంటి మార్పు ఉండబోదు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 22, 2023, 20:52 [IST]
English summary
Hero motocorp to hike prices by up to 2 percentage from april here the full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+