పెరగనున్న హీరో బైక్‌, స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?

భారత్‌లో ఎక్కువ మంది మెచ్చే బైక్‌ ఏది అని అడిగితే హీరో అని చాలా మంది సమాధానం చెబుతారు. అనేక సంవత్సరాలుగా అనేక మంది మనసుల్లో హీరో సంస్థ సుస్థర స్థానం సంపాదించుకుంది. అయితే హీరో తాజాగా షాక్‌ ఇచ్చే వార్తను చెప్పింది. తన బైక్‌, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

హీరో మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల ధరలు 1.5 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ సంవత్సరంలో హీరో సంస్థ ధరలు పెంచడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ నెలలో హీరో మోటార్స్‌ కార్పొరేషన్‌ తన టూవీలర్‌ ధరలను 2 శాతం పెంచింది.

Hero two wheeler price hike

హీరో వాహనాల్లో అత్యధిక పాపులర్‌ బైక్ స్ల్పెండర్‌ ప్లస్‌... ప్రస్తుతం ఈ బైక్‌ ధర రూ.72,471గా ఉంది. ఈ బైక్‌ 97.2సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. సుమారుగా 60kmpl మైలేజిని ఇస్తుంది. 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్‌ కలిగి ఉంటుంది. డ్రమ్‌ బ్రేక్‌ల వ్యవస్థతోపాటు డ్యూయల్‌ షాక్‌ అబ్జార్బర్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది.

హీరో ప్యాషన్‌ ప్రో తక్కువ ధర శ్రేణిలో అత్యుత్తమ బైక్‌లలో ఒకటి. దీని ధర ప్రస్తుతం రూ.76,056 (ఎక్స్‌షోరూం)కు అందుబాటులో ఉంది. 97.2సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మరియు 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. 4 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను కలిగి ఉంటుంది.

Hero two wheeler price hike

హీరో Xtreme 160R ప్రస్తుత ధర రూ.1,17,786 నుంచి రూ.1,28,608 మధ్య అందుబాటులో ఉంది. మరియు 163సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ 15.2PS గరిష్ఠ శక్తి, 14Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ సుమారుగా 55.47kmpl మైలేజీని అందిస్తుంది. డిస్క్ బ్రేక్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

Hero two wheeler price hike

హీరో పాపులర్ వాహనాల్లో జూమ్‌ మరొకటి. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ.73,099 నుంచి రూ.81,299గా ఉంది. ఈ స్కూటర్‌ 110సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 8.16 PS శక్తి, 8.7Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం 45 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. దాంతోపాటు డిస్క్‌ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్‌ టైర్లను కలిగి ఉంది.

సాధారణ ధరల సమీక్షలో భాగంగా బైక్‌, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ధరలు, ఇన్‌పుట్ కాస్ట్‌, వ్యాపార అవసరాల కోసమే ధరలు పెంచినట్లు హీరో పేర్కొంది. పెరిగిన ధరలు జులై 3 (సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని హీరో సంస్థ వెల్లడించింది.

అయితే ఆశ్యర్యకరంగా పండుగ సీజన్‌కు మందు హీరో ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో సాధారణంగా పండుగల సీజన్‌లో అత్యధిక శాతం ప్రజలు బైక్‌లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే సానుకూల ఆర్థిక సూచికలు డిమాండ్‌ను పెంచుతాయని హీరో భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 1, 2023, 16:33 [IST]
English summary
Hero motors announced that its two wheeler prices will be hiked from july 3rd 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+