Hero Passion Plus మరోసారి మార్కెట్లోకి విడుదలైన ప్యాషన్ ప్లస్ బైక్.. ధర రూ.76,065 మాత్రమే
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్(Hero Passion Plus) మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైంది. బీఎస్ 6 మార్గదర్శకాల తర్వాత నిలిపివేసిన ఈ బైక్.. మూడేళ్ల తర్వాత మార్కెట్‌లోకి విడుదల కావడంతో ఈ కొత్త హీరో బైక్ గురించిన పూర్తి వివరాలు ఈ కథనంలో మీ కోసం..
హీరో మోటోకార్ప్ తన ప్రముఖ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు గతంలో పేర్కొంది. దీంతో ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ఎన్నో అంచనాల మధ్య మార్కెట్‌లోకి విడుదలైంది. 3 సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

2020 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన BS6 ఉద్గార నిబంధనల కారణంగా హీరో మోటోకార్ప్ ప్యాషన్ ప్లస్ బైక్‌ను నిలిపివేసింది. BS6 మార్గదర్శకాల ప్రకారం అప్‌డేట్ చేయడంలో కొన్ని అవాంతరాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 2023 నుంచి BS6 యొక్క 2వ దశ నిబంధనలు అమల్లోకి రావడంతో Hero Passion Plusను ఇప్పుడు రీలాంచ్ చేసింది.
హీరో ప్యాషన్ ప్లస్ 97.2 సీసీ, సింగిల్ సిలిండర్ 'స్లోబర్' ఇంజిన్ కలిగి ఉంది. OBT-2 కంప్లైంట్ మరియు E20 ఫ్యూయెల్ అనుకూలతకు ప్యాషన్ ప్లస్ అప్‌గ్రేడ్ చేయబడింది. ఇంజిన్ I3S స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 8 hp పవర్ వద్ద 8.05 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

హెచ్‌ఎఫ్, స్ప్లెండర్ ఇంకా మొత్తం 5 Hero బైక్‌లలో అదే 97.2 సీసీ ఇంజన్ కలిగి ఉంది. బైక్ సస్పెన్షన్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు. కొత్త ప్యాషన్ ప్లస్ బైక్ బరువు 115 కిలోలుగా ఉంది. ఇది ప్రస్తుతం అత్యంత బరువైన 100సీసీ హీరో బైక్‌గా మార్కెట్‌లో నిలిచింది.
ఇక హీరో ప్యాషన్ ప్లస్‌లో బ్రేక్‌ల విషయానికొస్తే వాటి కోసం ముందు మరియు వెనుక చక్రాలకు 130mm డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. కొత్త ప్యాషన్ ప్లస్ బైక్‌లో కాస్ట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ చక్రాలు 80/100-18 కొలతలతో ట్యూబ్‌లెస్ టైర్‌లతో అమర్చబడి ఉంటాయి. ఈ కొత్త హీరో బైక్‌ను 3 విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది.

హీరో ప్యాషన్ ప్లస్‌లో సాంకేతిక ఫీచర్లను చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే మరియు USB ఛార్జింగ్ సౌకర్యం ఉన్నాయి. కొత్త హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ధర ఎక్స్ షోరూమ్‌లో రూ.76,065 గా ఉంది. ఇది హీరోకి చెందిన అత్యంత ఖరీదైన 100సీసీ బైక్. మార్కెట్‌లో విక్రయాలపరంగా ఈ బైక్ హోండా షైన్ మరియు బజాజ్ ప్లాటినా వంటి వాటితో పోటీపడుతోంది.
ఇటీవల హీరో మోటోకార్ప్ 2023 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ను విడుదల చేసింది. దానిని అనుసరించి ఇప్పుడు ప్యాషన్ ప్లస్ బైకును కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. స్ప్లెండర్ మరియు హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లతో భారత్‌లో బైక్‌లను విక్రయించడంలో హీరో మోటోకార్ప్ ముందు వరుసలో ఉంది. కొత్త ప్యాషన్ ప్లస్ బైక్ విడుదలతో హీరో ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








