Hero బైక్స్ అభిమానులకు షాకింగ్ వార్త.. ఇక నుంచి ఆ బైక్‌ను కొనుగోలు చేయలేరు..!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో హీరో ప్యాషన్ ప్రో బైక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ బైక్ ధర, డిజైన్, మైలేజ్ సహా ఇతర ప్రత్యేకతలు వినియోగదారులు బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ బైక్ గురించి ఓ షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. హీరో సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ బైక్ మోడల్‌ను తొలగించింది.
హీరో ప్యాషన్ ప్రో విక్రయాలు దశల వారీగా తొలగించబడతాయని దీని అర్థం. అయితే ఈ విషయం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. హీరో సంస్థ కూడా ఎలాంటి ప్రకటన లేకుండా బైక్ మోడల్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. హీరో ప్యాషన్ ప్రో బైక్ సామాన్య, మధ్యతరగతి ప్రజలను బాగా ఆకట్టుకుంది. భారత్‌లో రూ.85,000కు (ఎక్స్‌షోరూం ఢిల్లీ) ప్యాషన్ ప్రో బైక్ విక్రయించబడింది.

తక్కువ ధర సహా డిజైన్, మైలేజ్ కారణంగా మధ్య తరగతి, సామాన్యులను అధికంగా ఆకర్షించింది. హీరో మోటార్స్ తాజా నిర్ణయంతో ప్యాషన్ ప్రో బైక్ కొనుగోలుకు అందుబాటులో ఉండదు. అయితే హీరో సంస్థకు చెందిన ప్యాషన్ ప్లస్, ప్యాషన్ Xtec ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు బైక్‌లు కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
హీరో ప్యాషన్ ప్రో బైక్ 113.2cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 9.02bhp శక్తి, 9.89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఉండేది. ఈ బైక్ లీటర్‌కు 68.91 kmpl మైలేజీని ఇస్తుంది. దాంతో పాటు ఎక్కువ సంవత్సరాల పాటు మన్నిక వస్తుంది.

హీరో ప్యాషన్ ప్రో కంటే ఎక్స్‌టెక్ బైక్‌లో అధికంగా ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌టెక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డిజిటల్ కన్సోల్, సెమీ డిజిటల్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఉంటే ఇంజిన్ ఆఫ్ చేసే ఫీచర్, బ్లూటూత్ కనెక్టివిటి స్క్రీన్, USB ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ డిజిటల్ స్క్రీన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్స్, SMS లను చూడవచ్చు.
హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్... ప్యాషన్ ప్రో తరహా మోటార్ ఇతర హార్డ్‌వేర్ స్సెసిఫికేషన్లను కలిగి ఉంది. ఎక్స్‌టెక్ ధర రూ.80,038కు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) కొనుగోలు చేయవచ్చు. హీరో ప్యాషన్ ప్లస్ 97.2cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 7.91bhp శక్తి, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ.76,301 (ఎక్స్‌షోరూం, ఢిల్లీ)కు అందుబాటులో ఉంది.
అయితే హీరో సంస్థ ప్యాషన్ ప్రో బైక్‌ను ఎందుకు ఉపసంహరించుకుందనే సమాచారం వెల్లడించలేదు. ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ఫీచర్ల, ఇతర మార్పులతో మళ్లీ విడుదల చేస్తుందని కొంత మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: హీరో సంస్థ తీసుకున్న నిర్ణయం చాలా మందిని షాక్‌కు గురిచేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ బైక్‌ను ఉపసంహరించుకొనేందుకు గల స్పష్టమైన కారణం తెలియజేయలేదు. అయితే ప్యాషన్ ప్రో బైక్‌ను అప్‌డేట్ చేసి తిరిగి మార్కెట్ విడుదల చేయవచ్చని కొందరు భావిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








