పండుగ సీజన్ జోష్... 3.11 లక్షల విక్రయాలు నమోదుచేసిన Hero splendor.. మిగిలిన సంస్థలదీ అదే జోరు..!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో కార్లు సహా ఇతర వాహనాల కంటే ద్విచక్ర వాహనాల కొనుగోలు సంఖ్య గణనీయంగా ఉంటుంది. అయితే ద్విచక్ర వాహనాల కొనుగోలులో హీరో స్ప్లెండర్ సత్తా చాటింది. ప్రతినెల లక్షల వాహనాలను సులభంగా విక్రయిస్తోంది. అక్టోబర్ నెల విక్రయాల్లోనూ స్ప్లెండర్ సత్తా చాటింది.
అక్టోబర్ 2022లో 2,61,721 స్ప్లెండర్ బైక్‌లను విక్రయించగా... అక్టోబర్ 2023లో ఏకంగా 3,11,031 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం కంటే 49,310 ఎక్కువ స్ప్లెండర్ వాహనాలను విక్రయించింది. అంటే 18.84% విక్రయాలు పెరిగాయి.. అదే సెప్టెంబర్ 2023 సంవత్సరంలో హీరో సంస్థ 3,19,692 స్ప్లెండర్ బైక్‌లను విక్రయించింది.

రెండో స్థానంలో : ద్విచక్ర వాహనాల విక్రయాల్లో హోండా రెండో స్థానంలో ఉంది. యాక్టివా కూడా గణనీయమైన విక్రయాలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో 2,18,856 స్కూటర్లను విక్రయించింది. సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలకంటే 16200 ఎక్కువ యాక్టివా వాహనాలను విక్రయించింది.
ఈ జాబితాలో హోండా షైన్ మూడో స్థానంలో ఉంది. అక్టోబర్ నెలలో 1,63,587 హోండా షైన్ బైక్‌లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం అక్టోబర్ అమ్మకాలతో పోలిస్తే 32,671 యూనిట్ల షైన్ వాహనాలు ఎక్కువగా విక్రయం అయ్యాయి. ద్విచక్ర వాహన విక్రయాల్లో 4 స్థానంలో బజాజ్ పల్సర్ నిలిచింది.

అక్టోబర్ 2023లో బజాజ్ సంస్థ 1,61,572 పల్సర్ బైక్‌లను విక్రయించింది. సంస్థ గత విక్రయాల నివేదిక ప్రకారం.. పండుగ సీజన్ బజాజ్ విక్రయాలను గణనీయంగా మెరుగుపరిచింది. సాధారంగా బజాజ్ విక్రయాల సంఖ్య ప్రతి నెలా 1 లక్ష నుంచి 1.20 లక్షల వరకు మాత్రమే ఉంటాయి. అక్టోబర్ నెలలో ఏకంగా 1.60 లక్షలు దాటింది.
అక్టోబర్ 2023 ద్విచక్ర వాహన విక్రయాల్లో 1,17,719 అమ్మకాలతో ఐదో స్థానంలో హీరో HF డీలక్స్ నిలిచింది. 91824 విక్రయాలతో ఆరో స్థానంలో టీవీఎస్ జుపిటర్ ఉన్నాయి. గత సంవత్సరం విక్రయాల కంటే గణనీయమైన వృద్ధిని సాధించాయి. తర్వాత స్థానాల్లో 74,539 విక్రయాలతో బజాజ్ ప్లాటినా, 56,909 విక్రయాలతో సుజుకి యాక్సెస్, 53,162 విక్రయాలతో టీవీఎస్ ఎక్స్‌ఎల్, 47,483 విక్రయాలతో టీవీఎస్ జుపిటర్ ఉన్నాయి.

ఈ విక్రయాల సంఖ్య ఆధారంగా పండుగ సీజన్ ద్విచక్ర వాహన మార్కెట్‌కు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు గత సంవత్సరంతో పోలిస్తే అన్ని సంస్థల విక్రయాలు భారీగా వృద్ధి చెందాయి. ముఖ్యంగా హీరో స్ప్లెండర్ విక్రయాలు వరుసగా రెండు నెలలపాటు 3 లక్షలకు పైగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో పోలిస్తే మాత్రం అక్టోబర్ నెలలో తగ్గుముఖం పట్టాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








