స్ప్లెండర్ సిరీస్ లో మరో బైక్ రిలీజ్.. 125CCలో ఈ బైక్ బంగారమే..!!
సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మైలేజ్, ఫీచర్లతో కొత్త కొత్త బైక్స్ ని హీరో కంపెనీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరో బైక్ ని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. అందరికి అందుబాటు ధరలో ఈ బైక్ ను తీసుకువచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఇంతకు ఆ బైక్ వివరాలు ఎలా ఉన్నాయంటే..
హీరో మోటోకార్ప్ లో స్ప్లెండర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతలా ఆ బైక్ క్లిక్ అయ్యింది. ఏకంగా దశాబ్ద కాలంపాటు నిర్విరామంగా ఈ బైక్ సేల్స్ టాప్ లో నిలిచాయి. అంటే ఆ బైక్స్ ఉన్న ప్రత్యేకత గురించి చర్చించాల్సిన అవసరం లేదు. అదే పేరుతో సరికొత్త బైక్ ను హీరో మోటోకార్ప్ విడుదల చేసింది.

సరికొత్త స్ప్లెండర్ XTEC
ఆ బైక్ కి సూపర్ స్ప్లెండర్ XTECగా నామకరణం చేసింది. ఇది స్టైలింగ్ అప్ డేట్ లతో పాటు ప్రీమియం కనెక్టివిటీ ఫీచర్ లతో వస్తుందని సంస్థ వెల్లడించింది. రెండు విభిన్న వేరియంట్ లలో ఈ బైక్ ని తీసుకువచ్చింది. అందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ ఒకటి, రెండవది డ్రమ్ బ్రేక్ వేరియంట్. ఈ బైక్ లో అధునాతన ఫీచర్లను తీసుకువచ్చింది.
దేశంలోని యువ కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ XTEC అప్ డేట్ చేయబడిందని హీరో పేర్కొంది. ఆధునిక సాంకేతికతతో వస్తున్న ఫీచర్లు యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తాయని హీరో మోటోకార్ప్ తన అధికారిక ప్రకటన విడుదలలో పేర్కొంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న125 సీసీ విభాగంలోని ద్విచక్ర వాహనాలకు సమానంగా ఈ బైక్ ఉంటుందని సంస్థ వెళ్లడించింది.

అదిరే ఫీచర్స్..
ఈ సరికొత్త సూపర్ స్ప్లెండర్ XTEC హై-ఇంటెన్సిటీ పొజిషనింగ్ ల్యాంప్స్ తో కూడిన LED హెడ్ ల్యాంప్ ను కలిగి ఉంది. ఫ్యూయల్ అలెర్ట్ సూచికతో కూడిన పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, సర్వీస్ రిమైండర్, ఇంకా స్టాండ్ ఇతర అలెర్ట్ లను సూచిస్తుంది. అలాగే, ఇది కాల్, SMS హెచ్చరికలతో బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది.
125సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ డ్యూయల్-టోన్ స్ట్రిప్స్ తో మెరుగుపరుస్తుంది. ఇది ప్రయాణంలో మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి రైడర్ ను ఎనేబుల్ చేసే ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్ ను పొందుతుంది.సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ మొత్తం భద్రతను అమర్చింది. యాంత్రికంగా, మోటార్ సైకిల్ మునుపటిలానే ఉంటుంది.

BS6 ఇంజిన్ తో ఆధారితమైన, Hero Super Splendor XTEC 68 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది 7500 rpm వద్ద 10.7 bhp గరిష్ట శక్తిని 6000 rpm వద్ద 10.6 Nm గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. మోటార్ సైకిల్ కంపెనీ యొక్క i3S స్టాప్-స్టార్ట్ సిస్టమ్ తో ఈ బైక్ వస్తుంది.
83,000 నుంచి ప్రారంభ ధర..
అప్‌డేట్ చేయబడిన సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ 125 cc సెగ్మెంట్ లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (CGO) రంజీవ్‌జిత్ సింగ్ తెలిపారు. బైక్ లాంఛ్ సందర్భంగా మాట్లాడిన ఆయన హీరో మోటోకార్ప్ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల పోర్ట్ ఫోలియోలో అత్యుత్తమంగా XTECను తీర్చిదిద్దినట్లు చెప్పారు.

దేశంలోని రైడింగ్ ఔత్సాహికుల్లో హీరో బ్రాండ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుందని ఆయన అన్నారు. XTEC అవతార్ లో సూపర్ స్ప్లెండర్ పరిచయంతో మేము 125cc సెగ్మెంట్ ను టార్గెట్ గా ఎంచుకున్నామని అన్నారు. ఐకానిక్ సూపర్ స్ప్లెండర్ దాని కొత్త వెర్షన్ లో మా XTEC ఉత్పత్తితో, మా కస్టమర్ లకు అత్యుత్తమ కనెక్టివిటీ, సౌలభ్యం, డిజైన్ పై వర్క్ చేసిందని అని ఆయన వెల్లడించారు. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర 83,368 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 87268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనుంది.


Click it and Unblock the Notifications








