భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్

భారతదేశంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ ఈ రోజు 'జూమ్' (Xoom) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్, ఫీచర్స్ మరియు డిజైన్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX) మరియు జెడ్ఎక్స్ (ZX) వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 68,599, రూ. 68,599 మరియు రూ. 71,799 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బుకింగ్స్ ఫిబ్రవరి 01 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

కొత్త హీరో జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో విశాలంగా ఉన్న సీటు రైడర్ మరియు పిలియన్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. వెనుక భాగంలో హెచ్ షేప్ లో ఉండే టైల్‌లైట్‌ మరియు ముందు భాగంలో ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్ ఉంటుంది. ఈ స్కూటర్ 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది కాలర్ ID, ఇన్‌కమింగ్ కాల్స్ మరియు SMS, మిస్డ్ కాల్‌లు మరియు ఫోన్ బ్యాటరీ లెవెల్ వంటి వాటిని రైడర్ కి తెలియజేస్తుంది. అంతే కాకుండా ఇందులో USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ మరియు బూట్ లైట్‌ వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

హీరో జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది, కావున ఇది 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 బిహెచ్‌పి పవర్ మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకూండా ఇది CVT గేర్‌బాక్స్‌ పొందుతుంది.

మార్కెట్లో విడుదలైన కొత్త హీరో జూమ్ ఎలక్ట్రిక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు మోనోషాక్ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో హీరో యొక్క ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఇవన్నీ రైడింగ్ సమయంలో రైడర్ కి ఎంతగానో ఉపయోగపడతాయి.

భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం కొత్త వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఈ సమయంలో హీరో మోటోకార్ప్ ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడం వల్ల కంపెనీ మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెర్ల్ సిల్వర్ వైట్ మరియు బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

ఇప్పటికే హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ గా జూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కావడం హీరో మోటోకార్ప్ ప్రియులకు గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero xoom electric scooter launched price features details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X