అతి తక్కువ ధరకు హీరో స్కూటీ.. రూ.68,599కే సొంత చేసుకోవచ్చు..!

అతి తక్కువ ధరలో స్కూటర్ ని సొంతం చేసుకోవాలని ఉందా.. ఈ శుభవార్త మీకోసమే. ప్రముఖ హీరో కంపెనీ సరికొత్త స్కూటర్ ను విడుదల చేసింది. మార్గెట్ లో లభిస్తున్న స్కూటర్లలో ఇదే చీపెస్ట్ స్కూటర్ గా చెప్పవచ్చు. ఈ స్కూటర్ ను ఆధునాతన ఫీచర్లను జోడించి అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేక ఫీచర్లు ఇతర అప్ డేట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

జనవరి 30, 2023న జూమ్ LX, జూమ్ ZX వెర్షన్ లను సంస్థ విడుదల చేసింది. తాజాగా వాటిని డెలివరీ చేయడాన్ని హీరో మోటోకార్ప్ ప్రారంభించింది. 110సీసీ మోడళల్లో ఆ సంస్థ నుంచి అందిస్తున్న మూడవ స్కూటర్ ఇది. ప్రస్తుతం దగ్గర్లోని షోరూమ్ ల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

హీరో మోటోకార్ప్

అదిరిపోయే ఫీచర్లు..

H-ఆకారంలో LED DRL, ప్రొజెక్టర్ లెన్స్, LED హెడ్‌ ల్యాంప్‌ ను కలిపి స్పోర్టి స్టైలింగ్‌ తో ఈ స్కూటర్ ను తీసుకువచ్చింది. ఈ స్టైల్ హెడ్ లైట్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే 110 సీసీలో మొట్టమొదటిసారి కార్నరింగ్ ల్యాంప్స్ ను తీసుకువచ్చిన ఏకైక స్కూటర్‌ గా నిలిచింది. ప్రత్యేక ఆకర్షణ ఈ లైట్స్ నిలువనున్నాయి.

ఈ సరికొత్త 110లో ఇతర ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్, i3S స్టార్ట్-స్టాప్ సిస్టమ్, USB పోర్టల్ ఛార్జర్, బూట్ లైట్‌ తో కూడిన అండర్-సీట్ స్టోరేజ్ ఉన్నాయి. అలానే 12-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, కాంబి-బ్రేకింగ్‌ తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ ను ఈ స్కూటర్ కి అమర్చారు. దీంతో ఒకేసారి స్కూటర్ ను నిలిపి వేయవచ్చు.

దీంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఆధారంగా ఫీచర్ కాల్ SMS అలర్ట్స్ సదుపాయాన్ని కల్పించింది. ఫ్యూయల్ అలెర్ట్, స్కూటర్ ను ఎవరైనా చోరీ చేసేందుకు ప్రత్నిస్తుంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. అలానే ట్రాక్-మై-వెహికల్, టెలిమెట్రీ డేటా మొదలగు మరిన్ని ఫంక్షన్‌ లను ఈ స్కూటర్ అందిస్తుంది. ఈ అధునాతన ఫీచర్లను యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లతో వస్తున్న ఏకైక స్కూటర్ ఇదే అని కంపెనీ పేర్కొంది.

అద్భుతమైన పనితీరు..

8 bhp వద్ద 8.7 Nm గరిష్ట టార్క్ ను ఈ స్కూటర్ ఉత్పత్తి చేస్తుంది. 109 cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ నుంచి ఈ స్కూటర్ పవర్ తీసుకుంటుందని హీరో మోటాకార్ప్ తెలిపింది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్ ను ఈ స్కూటర్ లో పొందుపరచింది.

బేస్ LX వేరియంట్ ధర రూ.68,599 నుంచి ప్రారంభం కానుంది. అలానే టాప్-స్పెక్ ZX వేరియంట్ ధర రూ. 76,699 వరకు ఉండనుంది. ఈ ధరలు అన్ని ఎక్స్-షోరూమ్ ఢిల్లీ బేస్డ్ గా ఉన్నాయి. మిగతా కంపెనీలతో పోల్చితే అతి తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు జోడించి ఈ స్కూటర్ ని అందిస్తుంది ఆ సంస్థ.

ఇతర కంపెనీలతో పోటీ..

ప్రధాన కంపెనీల స్కూటర్లతో హీరో జూమ్ పోటీ పడనుంది. ముఖ్యంగా హోండా డియో, యాక్టివా 6Gతో పాటు TVS జూపిటర్ 110 సీసీలతో ఎక్కువగా పోటీ ఉండనుంది. సరికొత్త ఫీచర్లతో ఇతర స్కూటర్లకు ధీటుగా తయారు చేశారు. దాంతో ఈ స్కూటర్ కూడా వినియోగదారులను ఆకర్షించనుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి పోటీని తట్టుకొని నిలబడేలా ఈ స్కూటర్ ను తీసుకువచ్చింది. ఇందుకోసం ఈ స్కూటర్ అడ్వాన్స్డ్ ఫీచర్లు ఇతర అప్ డేట్స్ పై దృష్టి సారించింది. ధరను నిర్ణయించడంలో కంపెనీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఈ స్కూటర్ కు భారీ డిమాండ్ వస్తుందనీ కంపెనీ ఆశాభావం వ్యక్తంచేసింది.

More from DriveSpark

Article Published On: Monday, February 27, 2023, 12:31 [IST]
English summary
Hero xoom scooter sales begin starting price at rs 68599
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+