హీరో Xtreme 200S 4V బైక్‌ విడుదల.. ఫీచర్లు అదుర్స్‌..!

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లోకి హీరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. Hero Xtreme 200S 4V పేరుతో బైక్‌ను లాంచ్‌ చేసింది. ఫలితంగా 200cc సెగ్మెంట్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తోంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ బైక్ ఎక్కువ ధర, ఫీచర్లను కలిగి ఉంది.

పాత మోడల్‌ కంటే ఈ కొత్త బైక్ ధర రూ.6000 అధికం. మరింత శక్తివంతమైన పవర్‌ట్రైన్‌, ఫీచర్ల కారణంగా ధర ఎక్కువని తెలుస్తోంది. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4V మోటార్‌ సైకిల్‌ 200cc, 4 వాల్వ్‌, సింగిల్‌ సిలెండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 8000 rpm వద్ద 18.8bhp శక్తి మరియు 6500 rpm వద్ద 17.35 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hero Xtreme 200S 4V bike

ప్రస్తుతం అందుబాటులో ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200cc 2V బైక్‌ కంటే కొత్త బైక్‌ ఎక్స్‌ట్రీమ్ 200S 4V 6 శాతం ఎక్కువ శక్తి మరియు 5 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు హీరో కొత్త మోటార్‌ సైకిల్‌ 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మరియు 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ మరియు ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులను కలిగి ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200cc 4V బైక్‌ ముందువైపు టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌ వ్యవస్థ, వెనుకవైపు అడ్జస్టబుల్‌ మోనోషాక్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. అయితే హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 4V బైక్‌ ముందువైపు మరింత అత్యాధునిక USD ఫోర్క్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ బైక్‌ కేవలం సింగిల్ ఛానల్ ABSను మాత్రమే కలిగి ఉంది.

Hero Xtreme 200S 4V bike

హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200S 4V కొత్త స్ల్పిట్‌ హ్యాండిల్‌, టైర్‌ హగ్గర్‌ కలిగి ఉంది. LED DRLతో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు కలిగి ఉంటుంది. సిగ్నెచర్‌ లుక్ కోసం లైట్‌ గైడ్‌లతో కూడిన LED టెయిల్‌లైట్‌లతో వస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200cc 4V టర్న్‌ బై టర్న్‌ ఫీచర్‌, ఇన్‌కమింగ్‌ కాల్స్‌, టెక్స్ట్‌ మెసేజ్‌లను బైక్‌ డిస్‌ప్లే పైనే చూసే ఫీచర్లును కలిగి ఉంటుంది.

ఈ బైక్‌ మూన్‌ ఎల్లో, పాంథర్‌ బ్లాక్‌ మెటాలిక్‌, స్టెల్త్‌ ఎడిషన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ మోటార్‌ సైకిల్‌ కొన్ని కాస్మెటిక్‌ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఈ బైక్‌ ధర 1.41 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 200S 4V మోటార్‌సైకిల్‌ సుజుకి జిక్సర్‌ SF మరియు యమహ R155 బైక్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 19, 2023, 12:26 [IST]
English summary
Hero xtreme 200s 4v bike launched in india at 1 41 lakh price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+