అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త యాక్టివా హెచ్ స్మార్ట్‌ స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ మరియు ప్రైస్ వంటి తప్పకుండా తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరలు:

హోండా మోటార్‌సైకిల్ విడుదల చేసిన ఈ యాక్టివా హెచ్ స్మార్ట్‌ స్కూటర్ ధర రూ. 80,537. అయితే కంపెనీ యాక్టివా హెచ్ స్మార్ట్‌తో పాటు 'యాక్టివా 6జి స్టాండర్డ్' మరియు 'యాక్టివా 6జి డిఎల్‌ఎక్స్' అనే వేరియంట్స్ కూడా లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 74,536 మరియు రూ. 77,036 (ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త అప్డేటెడ్ మోడల్స్ దాని స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ ధరను పొందుతాయి.

అప్డేటెడ్ హోండా యాక్టివాలో తెలుసుకోవాల్సిన 5 విషయాలు

ఇంజిన్ & పర్ఫామెన్స్:

కొత్త అప్డేటెడ్ హోండా యాక్టివా ఫీచర్స్ పరంగా అప్డేట్ పొందినప్పటికీ ఇంజిన్ మరియు పర్ఫామెన్స్ పరంగా ఎటువంటి మార్పుకు లోను కాలేదు. కావున ఈ కొత్త యాక్టివా 6G వేరియంట్ 7.73 బిహెచ్‌పి పవర్ మరియు 8.9 ఎన్ఎమ్ టార్క్ పఉత్పత్తి చేసే అదే 109.51 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది పనితీరు పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున వాహన వినియోగదారుకు మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

కలర్ ఆప్సన్స్:

నిజానికి భారతదేశంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు మల్టిపుల్ కలర్ ఇష్టపడతారు. ఎందుకంటే కలర్ అనేది వినియోగదారుని యొక్క అభిరుచుకి తగిన విధంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ తమ ఉత్పత్తులను వివిధ కలర్ ఆప్సన్స్ లో విడుదల చేస్తాయి. ఇందులో భాగంగానే హోండా యాక్టివా డీసెంట్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, బ్లాక్, పెర్ల్ ప్రెషియస్ వైట్ మరియు పియర్ సైరన్ బ్లూ అనే ఆరు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

అప్డేటెడ్ ఫీచర్స్:

హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ స్కూటర్ స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ ఫైండ్ మరియు స్మార్ట్ సేఫ్ అనే అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని స్మార్ట్ అన్‌లాక్ ఫీచర్ మీ యాక్టివా హ్యాండిల్‌ బార్లు, స్టోరేజ్ ఏరియా మరియు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ వంటి వాటిని లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్మార్ట్ స్టార్ట్ ఫీచర్ స్టార్ట్ అన్‌లాక్ ఫీచర్ మాదిరిగా ఉపయోగపడుతుంది.

హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ స్కూటర్ లో ఉండే స్మార్ట్ సేఫ్ ఫీచర్ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఇది స్కూటర్‌ను లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాంటీ థెఫ్ట్ సిస్టమ్ యాక్టివేట్ చేయబడిందని మీకు తెలియడానికి కీ లైట్లు రెడ్ కలర్ లో కనిపిస్తాయి. అప్పుడు మీ స్కూటర్ సేఫ్ గా ఉందని నిర్దారించుకోవచ్చు. మొత్తం మీద కొత్త హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ స్కూటర్ ఈ ఆధునిక కాలంలో ఉపయోగపడే అధునాతహం ఫీచర్స్ పొందుతుంది.

డిజైన్:

హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ డిజైన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రకాశవంతమైన దృశ్యమానతను అందించడానికి అనుకూలంగా ఉండే హెడ్ లాంప్, టర్న్ ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది సింగిల్ పీస్ సీట్ కలిగి ఉంటుంది, అయినప్పటికీ రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ తలపిస్తుంది.

అప్డేటెడ్ హోండా యాక్టివా విడుదలపై మా అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి, దీనికి ప్రధాన కారణం కస్టమర్లు కొత్త వాహనాలను కోరుకోవడమే. అంతే కాకుండా కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్ కోరుకోవడం వల్ల కంపెనీలు కూడా ఆధునిక ఫీచర్స్ అందించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఫీచర్స్ కలిగిన వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Honda activa 6g smart key top five things in telugu
Story first published: Thursday, January 26, 2023, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X