యూత్ ఫేవరెట్ సరికొత్త స్ట్రీట్ ఫైటర్ హోండా CB300F విడుదల.. ధర రూ. 1.70 లక్షలు
దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ స్కూటర్స్ ఇండియా నేడు సరికొత్త CB300F 2023 వెర్షన్ బైక్‌ను విడుదల చేసింది. OBD-2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేటెడ్ స్ట్రీట్ ఫైటర్‌ను తీసుకువచ్చింది. ఇక ఈ బైక్ ధర, ఫీచర్లు, డిజైన్ ఇతర వివరాలు ఈ కథనంలో..
హోండా స్ట్రీట్ ఫైటర్ CB300F మోటార్‌సైకిల్‌ను ఆకర్షణీయమైన లుక్స్, డీసెంట్ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ ఇంకా కాంపోనరీతో విడుదల చేసింది. ఇక రోజువారీ ప్రయాణాలు, వారాంతపు విహారయాత్రల కోసం రైడర్లకు డూ ఇట్ ఆల్ మోటార్‌సైకిల్‌గా ఉండాలనే లక్ష్యంతో ఈ బైక్‌ను తీసుకువచ్చారు.

ఈ కొత్త హోండా CB300F 'ఫోర్మిడబుల్' స్ట్రీట్ ఫైటర్ ఇంజిన్ పనితీరును పరిశీలిస్తే.. ఓల్డ్ వెర్షన్ మాదిరిగానే ఆయిల్ కూల్డ్ 293 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయినప్పటికీ, హోండా ఇప్పుడు BS6 P2 పరివర్తనలో భాగంగా OBD-II A నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్ 24 bhp వద్ద 25.6 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త CB300F 6 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్, స్లిప్, అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉంది. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది ఓల్డ్ వెర్షన్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) లాగానే ఉంది.
ఈ అప్‌డేటెడ్ బైక్‌లో డ్యూయెల్ ఛానల్ ABS, గోల్డెన్ ఫినిష్డ్ USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 5 స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్, ఫ్యాట్ 150 సెక్షన్ రియర్ టైర్, మరిన్నింటితో రెండు చివర్లలో ఒకే డిస్క్ సెటప్‌తో వస్తుంది.
ఇక ఈ కొత్త బైక్ ఫీచర్లను పరిశీలిస్తే అన్ని LED లైటింగ్, అడ్జస్టబుల్ బ్రైట్‌నెస్‌తో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం హోండా స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS) వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి.
కొత్త 2023 మోడల్ OBD-II A ఇంజిన్, ఇతర ఆధునిక టెక్నాలజీతో మరింత అభివృద్ధి చెందింది. ఇది రైడర్లకు రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందనడంలో సందేహం లేదు. ఇక కొత్త 2023 హోండా CB300F OBD-II A, డీలక్స్ ప్రో వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
2023 CB300F విడుదలపై హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్, మిస్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడారు. 2023 OBD-II A నిబంధనలకు అనుగుణంగా CB300Fని పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. కస్టమర్లందరికీ నిజమైన స్ట్రీట్ ఫైటర్, రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. కమ్యూటర్లకు శక్తివంతమైన మరియు చురుకైన పనితీరును అందిస్తుందన్నారు. బుకింగ్‌లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.కాగా హోండా
CB300F సరికొత్త వెర్షన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిగ్ వింగ్ డీలర్ నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ధర ఎక్స్ షోరూమ్‌లో రూ. 1.70 లక్షల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








