సరికొత్త ఫీచర్లతో హోండా నుంచి CB300R బైక్‌ విడుదల.. ఇంజిన్‌ పర్ఫామెన్స్‌, డిజైన్‌ అదరహో.!!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ & స్కూటర్ ఇండియా నుంచి మరో కొత్త బైక్‌ 2023 CB300R దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. OBD2A కంప్లయింట్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో హోండా నుంచి విడుదలైన ఈ కొత్త బైక్‌ విశేషాలేంటో చూద్దాం..

హోండా కొత్త 2023 CB300R బైక్‌ను OBD2A(On-Board-Diagnostics) కంప్లైంట్‌ అంటే.. 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించారు. 20 శాతం ఇథనాల్ ఉపయోగించడం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు. కాగా ఈ బైక్‌ బరువు 146 కిలోలు.

Honda-CB300R-Launch

ఇక కొత్త హోండా 2023 CB300R బైక్‌ డిజైన్‌ విషయానికొస్తే ఇందులో ప్రత్యేకంగా LED లైట్లను అమర్చారు. LED హెడ్‌ల్యాంప్, LED బ్లింకర్స్, LED టెయిల్‌ లైటింగ్‌ ద్వారా మరింత స్టైలిష్‌గా హోండా సంస్థ దీనిని రూపొందించింది. 41mm USD ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు అడ్జస్టబుల్ మోనో-షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉండటంతో ఇది భారతీయ రోడ్లపై ప్రయాణించేందుకు అనువైన బైక్‌ అని కంపెనీ పేర్కొంది.

కొత్త CB300R లో బ్రేకింగ్‌ సిస్టమ్‌ను పరిశీలిస్తే ఇందులో ఫ్రంట్‌ భాగంలో 296mm డిస్క్ బ్రేక్, వెనుక 220mm డిస్క్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌ను అందించారు. ఈ బైక్‌ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇందులో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హజార్డ్ లైట్ స్విచ్‌ని చూడవచ్చు.

Honda-CB300R-Launch

కొత్త హోండా CB300R శక్తివంతమైన 286.01cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 31 హెచ్‌పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హోండా ఈ బైక్‌ ఇంజిన్‌ను కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించినప్పటికీ, దాని ఇంజిన్ పనితీరులో ఎటువంటి మార్పు లేదు. ఈ బైక్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. తమ విభాగంలో ఈ బైక్‌ అత్యుత్తమ పనీతీరును కనబరుస్తుందని హోండా తెలిపింది.

కొత్త హోండా CB300Rలో హెల్పింగ్‌ స్లిప్పర్ క్లచ్‌ని ఇచ్చారు. దీని ద్వారా గేర్‌షిఫ్ట్‌లను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. ఇందులో అత్యవసర బ్రేకింగ్ లైట్ ఫీచర్‌ మరో ప్రత్యేకత. ఇది కంపెనీ యొక్క టాప్‌ లెవెల్‌ మోటార్‌సైకిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు బ్రేక్‌పై గట్టిగా నొక్కినప్పుడు అది అత్యవసర పరిస్థితిని సూచించడానికి లైట్లను ఫ్లాష్ చేస్తుంది.

కొత్త 2023 హోండా CB300R ఆకర్షణీయమైన కలర్స్‌లో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. పెరల్ స్పార్టన్ రెడ్, మ్యాట్ మాసివ్ గ్రే మెటాలిక్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను రూ. 2,40,000 ఎక్స్‌ షోరూమ్‌ ధరతో హోండా సంస్థ విడుదల చేసింది. కాగా బుకింగ్‌లు కూడా సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కస్టమర్లు హోండాకు చెందిన సమీప డీలర్‌షిప్‌లలో CB300Rని బుక్ చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 300 సీసీ బైక్‌లకు పోటీగా హోండా CB300R సీసీ బైక్‌ను హోండా విడుదల చేసింది. 300cc బైక్‌లకే కాకుండా కొన్ని 400cc బైక్‌లకు కూడా కొత్త CB300R గట్టి పోటీనిస్తుంది. KTM 390 డ్యూక్, ట్రయంఫ్ స్పీడ్ 400, BMW G310R మరియు TVS అపాచీ RTR 310 వంటి వాటితో పోటీ పడనుంది.

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, CEO సుత్సుము ఒటాని భారత్‌లో 2023 CB300Rని విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఎకో ఫ్రెండ్లీ నేచర్‌తో OBD2A కంప్లైంట్ ఇంజిన్‌తో బైక్‌ను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. హోండా ఇంజినీరింగ్ టెక్నాలజీ, డిజైన్ ఫిలాసఫీ, ప్రీమియం బిల్డ్ క్వాలిటీని చూసి హోండా CB300R రైడర్లు ఆశ్చర్యపోతారన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 17, 2023, 8:51 [IST]
English summary
Honda cb300r motorcycle launched in india price specs engine performance full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+