Honda డియో 125 స్కూటర్‌ విడుదల.. అందుబాటు ధర, ఆకట్టుకొనే ఫీచర్లు..!

దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో దూసుకెళ్లే విధంగా హోండా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 125 సీసీ వాహనాల సెగ్మెంట్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హోండా నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డియో 125 స్కూటర్‌ విడుదల అయింది.

దేశంలో హోండా నుంచి వచ్చిన డియో అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఇటీవల డియో అమ్మకాలు తగ్గాయి. దీంతో అప్‌గ్రేడ్‌ చేసిన వేరియంట్‌ను హోండా ఇవాళ విడుదల చేసింది. హోండా డియో 125 స్కూటర్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్‌ మరియు స్మార్ట్‌ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. OBD2 ప్రమాణాల ప్రకారం ఈ స్కూటర్లలో అప్‌గ్రేడ్‌ చేసిన ఇంజిన్‌ను ఉపయోగించారు.

Honda Dio 125 scooter

హోండా డియో 125 స్కూటర్‌ 125సీసీ ఇంజిన్‌ గరిష్ఠంగా 8.3bhp శక్తి మరియు 10.4Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా కొత్త స్కూటర్‌లో ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, డ్రమ్ బ్రేక్‌ ఆప్షన్లను కలిగి ఉంది. మరియు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌, అరుదైన మోనోషాక్‌ సస్సెన్షన్‌ సెటప్‌, 12/10 అంగుళాల టైర్‌లతో కూడిన అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. ఈ స్కూటర్‌ 171మిమీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.

ఈ డియో 125 స్కూటర్‌లో స్టార్ట్‌/స్టాప్‌ సిస్టమ్, సైలెంట్‌ స్టార్టర్‌, డిజిటల్‌ డ్యాష్‌బోర్డు మరియు ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ఐడ్లింగ్‌ స్టాప్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ సహా కంబైన్డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీంతో పాటు 18 లీటర్‌ బూట్‌ స్పేస్‌, ఇంధన క్యాప్‌ తెరిచేందుకు డ్యూయల్‌ ఫంక్షన్‌ స్విచ్‌లు ఉన్నాయి.

Honda Dio 125 scooter

హోండా డియో 125 స్కూటర్‌ ముందు షార్ప్‌ హెడ్‌ ల్యాంప్‌లు మరియు ఆకట్టుకొనే పొజిషన్‌ లైట్‌ గతం కంటే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. డియో వెనుక భాగం అప్‌డేటెడ్‌ టెయిల్‌ ల్యాంప్‌ మరియు స్ప్లిట్‌ గ్రాబ్‌ రైల్‌తో అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంది.

ఈ స్కూటర్‌ పెరల్‌ నైట్‌ స్టార్‌ బ్లాక్‌, పెరల్‌ సైరన్‌ బ్లూ, పెరల్‌ డీప్ గ్రౌండ్‌ గ్రే, మ్యాట్‌ మార్వెల్‌ బ్లూ మెటాలిక్‌, మ్యాట్ యాక్సెస్‌ గ్రే మెటాలిక్‌, మ్యాట్‌ రెడ్‌ మెటాలిక్, స్పోర్ట్స్‌ రెడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. హోండా సంస్థ 3 సంవత్సరాల సాధారణ వారంటీ సహా 7 సంవత్సరాల పొడిగించదగిన వారంటీని అందిస్తుంది.

Honda Dio 125 scooter

హోండా డియో 125 స్కూటర్ స్డాండర్డ్‌ వేరియంట్‌ రూ.83,400గా (ఎక్స్‌షోరూం) ఉంది. స్మార్ట్‌ వేరియంట్‌ ధర రూ.91,300గా (ఎక్స్‌షోరూం) ఉంది. హోండా డియో 125 స్కూటర్‌ సుజుకి అవెనిస్‌, యమహా రే ZR 125 స్కూటర్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 13, 2023, 19:48 [IST]
English summary
Honda dio 125 scooter launched in india at rs 83 400 starting price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+