EM1 Scooter మార్కెట్‌లోకి హోండా కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

పర్యావరణ హితమే లక్ష్యంగా ఆటో మొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలతో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. అందుకు తగినట్లుగా ఆకర్షణీయమైన ఫీచర్లు, అధికరేంజ్‌ని అందించే స్కూటర్లను సంస్థలు విడుదల చేస్తున్నాయి. అదే కోవలో హోండా ‌అదిరిపోయే ఫీచర్లతో యూరప్‌లో ఓ కొత్త మోడల్‌ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

‌‌రిమూవబుల్‌ బ్యాటరీ ఫెసిలిటీతో హోండా ఈఎమ్‌1e(EM1) పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తాజాగా విడుదల చేసింది. హోండా విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ ఇదే కావడం విశేషం. ఈ స్కూటర్ ముఖ్యంగా పట్టణాల్లో నివసించే కస్టమర్ల కోసం రూపొందించింది. స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్‌తో ఈ స్కూటర్ రానుంది. యూరప్‌లో ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ దీనిని సంస్థ తీసుకువచ్చింది.

honda em1 View

హోండా కంపెనీ ‌గత ఏడాది సెప్టెంబర్‌లో హోండా EM1e ని విడుదల చేస్తున్నట్లు మొదటిసారిగా ప్రకటించింది. వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నిర్మూలనే లక్ష్యంగా హోండా మోటార్స్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ స్కూటర్ తో పాటు బ్యాటరీ మరియు ఛార్జర్‌లను లీజుకు తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ సౌకర్యం ఆయా దేశాల నియమాలకు లోబడి ఉంటాయని వినియోగదారులు గమనించాలి.దీనిని అద్దెకు తీసుకోవడం లేదా సబ్‌స్క్రయిబ్ కూడా చేసుకోవచ్చు.

బ్యాటరీ ప్రత్యేకతలు: లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో ఈ స్కూటర్ వస్తుంది. ఈ బ్యాటరీ బరువు 10.3 కిలోలుగా ఉంది. 1.47 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. 270W AC ఛార్జర్ తో 6 గంటల్లో 100 శాతం పూర్తి చేయవచ్చు. 2 గంటల 40 నిమిషాల్లో 75 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. ఈ ఈఎమ్‌1e గంటకు 45 కి.మీ వేగం ప్రయాణిస్తుంది.

em1 front view

హోండా ఈఎమ్‌ 1 ప్రత్యేకతలు: ఈ స్కూటర్ నార్మల్ మోడ్ లో 41.3 కి.మీ మరియు ECON మోడ్‌లో 48 కి.మీల పరిధిని అందిస్తుందని హోండా తెలిపింది. LCD ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌తో పాటు చుట్టూ LED లైటింగ్ ఉన్నాయి. అండర్ సీట్ స్టోరేజ్ కేవలం 3.3L, ఫ్రంట్ లగేజ్ ప్రొవిజన్స్ 500ml PET బాటిల్, USB టైప్-A పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంటాయి.

వినియోగదారులు తాము కొనుగోలు చేసిన వాహనాన్ని బట్టి యజమానులు హోండా EM1 eని AC ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. లేదా హోండా పవర్ ప్యాక్ e స్వాపింగ్ స్టేషన్‌ల్లో ఛార్జీ‌ చేయవచ్చు. హోండా వచ్చే ఏడాది భారత్‌లో యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్ ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ ధర విషయాన్ని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

em1e rear view

గ్రౌండ్ క్లియరెన్స్ 130 మిమీ, సీటు ఎత్తు 740 మిమీ, మరియు వీల్‌బేస్ 1300 మిమీగా ఉంది. ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, కాంబి బ్రేకింగ్‌తో ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేకింగ్ ని పొందవచ్చు.

ఆకర్షణీయమైన కలర్స్‌: ఈ స్కూటర్ ని సరికొత్త కలర్స్ లో సంస్థ తీసుకువచ్చింది. ఇది పెర్ల్ సన్‌బీమ్ వైట్, డిజిటల్ సిల్వర్ మెటాలిక్, మ్యాచ్ బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ కలర్స్‌లో లభిస్తుంది. సిటీ కమ్యూటర్ స్కూటర్ గా విడుదల కాబోతున్న ఈఎమ్1e వినియోగదారులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఒక్కసారి దేేశీయ మార్కెట్లోకి విడుదలయ్యాక ఈ స్కూటర్ తన సత్తాను చాటే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ఆశిద్దాం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, May 14, 2023, 13:56 [IST]
English summary
Honda em1e scooter new launch with 48km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+