అడ్వెంచర్ టూరర్ XL750 Transalp బైక్‌ను లాంచ్ చేసిన హోండా.. ధర, ఫీచర్లు ఇవే..
బైక్ లవర్స్ ముఖ్యంగా అడ్వెంచరస్ రైడ్ కోరుకునే వారు.. కొత్త రకం స్పోర్టీ బైక్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఎలాంటి కఠినమైన రోడ్లలో అయినా అడ్వెంచరస్ బైక్‌లపై చాలా ఈజీగా రైడ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాంటి సాహస ప్రియుల కోసం ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా కొత్త అడ్వెంచర్ టూరర్‌ను విడుదల చేసింది.
దేశీయ మార్కెట్లో నం.1 గా కొనసాగుతున్న హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా(HMSI) నుంచి కొత్త అడ్వెంచర్ టూరర్ బైక్ Honda XL750 ట్రాన్సల్ప్ తాజాగా లాంచ్ అయింది. జపాన్‌లో తయారైన ఈ బైక్.. మెరుగైన పనితీరు, ప్రీమియం లుక్‌తో బైక్ రైడర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.

ఇప్పటివరకు హోండా నుంచి పలు రకాల మోడల్ బైక్‌లు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. తాజాగా XL750 Transalp జపాన్‌లో రూపొందించబడి భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ బైక్ ప్రత్యేకంగా ప్రీమియం బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయించబడుతుందని హోండా స్పష్టం చేసింది.
హోండా XL750 Transalp బైక్ ధర రూ. 10,99,990(ఎక్స్ షోరూమ్) గా సంస్థ నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా అడ్వెంచరస్, ప్రీమియం లుక్‌తో హోండా దీనిని రూపొందించింది. కాగా పరిమిత సంఖ్యలోనే ఈ బైక్‌లు తయారుకాగా.. బుకింగ్‌లు ప్రస్తుతం మొదటి 100 మంది కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని హోండా తెలిపింది.

ఈ ఏడాది నవంబర్‌లో హోండా XL750 Transalp బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని హోండా పేర్కొంది. అయితే ఈ హోండా XL750 ట్రాన్సల్ప్ అడ్వెంచర్ బైక్‌కు సంబంధించిన మరిన్ని యూనిట్లు భారత్‌లోకి దిగుమతి అవుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇక ఈ బైక్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ పనితీరుపై ఓ లుక్కేద్దాం.
హోండా XL750 Transalp అడ్వెంచరస్ బైక్ హిమాలయాల్లోని కఠినమైన భూభాగాల్లో సైతం ప్రయాణిస్తుందని హోండా తెలిపింది. హైదరాబాద్‌లాంటి ట్రాఫిక్ నగరాల్లో కూడా ఈ బైక్‌ను ఈజీగా రైడ్ చేయవచ్చు. కాగా కొత్త హోండా XL750 ట్రాన్సల్ప్ బైక్.. ఆకర్షణీయమైన రాస్ వైట్ ఇంకా మేటర్ బాలిస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

కొత్త హోండా XL750 Transalp బైక్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 5.0-అంగుళాల TFT డిస్‌ప్లే, హోండా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCలు), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఆటోమేటిక్ టర్న్ సిగ్నల్ క్యాన్సిలేషన్ లాంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఇంకా TFT డిస్‌ప్లే స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్-పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, ఫ్యూయెల్ వినియోగం, ఇంకా మరిన్ని ఇతర సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది.
కొత్త హోండా XL750 ట్రాన్సల్ప్ బైక్ ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 755cc, ట్విన్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 270-డిగ్రీ క్రాంక్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజిన్ 90.51 బీహెచ్‌పీ మరియు 75 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
ఈ బైక్ ఇంజిన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో నికెల్-సిలికాన్ కార్బైడ్ కోటింగ్, వోర్టెక్స్ ఫ్లో డక్ట్స్, థొరెటల్-బై-వైర్ టెక్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), ఇంజిన్ బ్రేకింగ్ ఇంకా మల్టిపుల్ రైడ్ మోడ్‌లను హోండా ప్రవేశపెట్టింది. స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, గ్రావెల్ మరియు యూజర్ అనే విభిన్న రకాల రైడ్ మోడ్‌లు ఉన్నాయి. రైడర్లు తమకు అనుకూలమైన రైడింగ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు.
కొత్త హోండా XL750 Transalp బైక్ సస్పెన్షన్‌ను పరిశీలిస్తే.. ఇందులో తేలికపాటి స్టీల్ డైమండ్ ఫ్రేమ్, ముందు వైపున 43mm SFF-CA USD ఫోర్క్స్, వెనుక వైపున ప్రో-లింక్ మోనో సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా, బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు డ్యూయల్ 310 మిమీ డిస్క్ బ్రేక్‌లు, వెనుక వైపున ఒక సింగిల్ 256 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అడ్వెంచరస్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ బైక్ బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications








