Honda Livo 2023 బైక్‌ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇటీవలే భారత మార్కెట్‌లో Honda Livo 2023 బైక్‌ను విడుదల చేసింది. ఈ మోటార్‌ సైకిల్‌ భారత్‌లోని కస్టమర్లను ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది. అయితే ఈ బైక్‌ గురించి తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు మీకోసం.

యువతను ఆకట్టుకొనే ఉద్దేశంతో ఈ బైక్‌ను చాలా స్టైలిష్‌గా డిజైన్‌ చేశారు. మరింత మందిని ఆకట్టుకొనేందుకు కొత్త గ్రాఫిక్స్‌ను జత చేశారు. ఇది లుక్‌ను మరింత మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఈ బైక్‌ పొడవైన సీట్‌తో వస్తుంది. మరియు అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. బైక్‌ అథ్లెటిక్‌ బ్లూ మెటాలిక్‌, మ్యాట్‌ క్రస్ట్‌ మెటాలిక్‌, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

Honda Livo 2023 bike

హోండా లివో బైక్‌ 109.51cc సింగిల్‌ సిలెండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 7500 rpm వద్ద 8.67 bhp, 5500 rpm వద్ద 9.30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ 4 -స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. శక్తిని వెనుక చక్రాలకు పంపుతుంది. టూ వే ఇంజిన్‌ స్టార్ట్‌/ స్టాప్‌ స్విచ్‌, సైలెంట్‌ స్టార్ట్‌ మోటార్‌, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్‌ పంప్‌ సహా ఇతర ఫీచర్లు ఉన్నాయి.

హోండా లివో బైక్‌ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. DC హెడ్‌ల్యాంప్‌, కాంబీ బ్రేక్‌ సిస్టమ్‌, RSU టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, 5 స్టెప్‌ అడ్జస్టబుల్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్స్‌, ఎయిర్ ఫిల్టర్‌, సీల్డ్‌ చైన్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, తక్కువ నిర్వహణ కలిగిన 4Ah బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Honda Livo 2023 bike

వారంటీ కొత్త హాండో లివో మోటార్‌సైకిల్‌ స్టాండర్డ్‌గా 3 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. కస్టమర్ల వారంటీని పొడిగించుకోవాలని భావిస్తే మరో 7 సంవత్సరాల ఆప్షనల్‌ వారంటీ పొందవచ్చు. అంటే మొత్తం 10 సంవత్సరాలపాటు వారంటీ ఉంటుంది. హోండా లివో బైక్‌ డ్రమ్‌, డిస్క్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ.78,500 (ఎక్స్‌షోరూం), డిస్క్‌ వేరియంట్‌ రూ.82,500 (ఎక్స్‌షోరూం) ధరలకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

హోండా లివో బైక్‌ ఇంజిన్‌ ఇంటెలిజెంట్‌ సెన్కార్లు ఉన్నాయి. ఇంజిన్‌ లోపల ఇంధనం, గాలి మిశ్రమాన్ని సరైన స్థాయిలో అందించడంలో సహాయపడుతుంది. ఇవి బైక్‌ మైలేజ్‌ని మెరుగుపరుస్తాయి. బైక్‌ నడుపుతున్నప్పుడు ఇంజిన్‌ భాగాల మధ్య రాపిడి వల్ల మైలేజ్‌ ప్రభావితం అవుతుంది. ESP సాంకేతికత ఇంజిన్‌ భాగాల్లో ఘర్షణను తగ్గిస్తుంది.

Honda Livo 2023 bike

హోండా లివో మోడల్‌ను సంస్థ 2015లోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి టెక్నికల్‌, డిజైన్‌ పరంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వచ్చింది. ఈ బైక్‌ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధానంగా మైలేజ్‌ ఆకర్షి్స్తుంది. ఇప్పుడు కొత్తగా OBD2 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి మార్కెట్‌లో లాంచ్‌ చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 21, 2023, 13:35 [IST]
English summary
Honda Livo 2023 bike top things we need to know in telugu
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+