Honda కు కలిసొచ్చిన పండుగ సీజన్.. నవంబర్ నెలలో భారీ స్థాయిలో విక్రయాలు..!
హోండా సంస్థకు పండుగల సీజన్ బాగా కలిసి వచ్చింది. ఫలితంగా నవంబర్ నెలలో గణనీయ స్థాయిలో హోండా మోటార్ సైకిళ్లు, స్కూటర్లు విక్రయాలు జరిగాయి. నవంబర్ 2023 నెలలో 4,47,849 యూనిట్లు బైక్, స్కూటర్లను విక్రయించింది. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసింది.
హోండాకు కలిసొచ్చిన పండుగ సీజన్ : నవంబర్ నెలలో దేశీయంగా 4,20,677 యూనిట్లు స్కూటర్లు, బైక్‌లను ( Honda sales in november) విక్రయించగా.. 27,172 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. ఈ సంఖ్యలో నవంబర్ నెలలో అత్యధిక విక్రయాలు నమోదు చేసినట్లు హోండా సంస్థ వెల్లడించింది.

హోండా సంస్థ ఇటీవలే ప్రీమియం మిడ్ సైజ్ 350cc మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లో రెట్రో క్లాసిక్ CB350 బైక్‌ను రూ.1,99,900 (ఎక్స్‌షోరూం )కు విడుదల చేసింది. ఈ కొత్త హోండా బైక్ అత్యాధునిక టెక్నాలజీ సహా మెరుగైన పనితీరు కనబరుస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ హోండా బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
హోండా CB350 బైక్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. కొత్త ఫ్యూయల్ ట్యాంక్, రెట్రో లుక్‌తో అప్‌గ్రేడ్ చేసిన సైడ్ ప్యానల్, RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ కాంబినేషన్‌తో సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ CB350 DLX, CB350 DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్‌పైన మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ సహా 7 సంవత్సరాల ఆప్షనల్ వారంటీని కలిగి ఉంటుంది.

హోండా CB350లో ఫ్యూయల్ ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, LED బ్లింకర్లు సహా LED టెయిల్ ల్యాంప్‌ను ఆకర్ణణీయంగా తయారుచేశారు. ఈ బైక్.. మోటాలిక్, మ్యాట్ షేడ్స్‌తో 5 ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అంటే రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ మరియు మ్యాట్ డ్యూన్ బ్రౌన్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
హోండా CB350 ఫ్రంట్‌లో 310mm డిస్క్ మరియు డ్యూయల్ ఛానల్ ABSతో వెనుకవైపు 240mm డిస్క్‌ను కలిగి ఉంది. ఇందులో 18 అంగుళాల వీల్స్‌ను అమర్చారు. మరియు ఈ బైక్ ముందువైపు 310mm డిస్క్ బ్రేక్, వెనుకవైపు 240mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. మరియు ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS ఫీచర్‌తో వస్తుంది.
హోండా CB350 రెట్రో క్లాసిక్ బైక్ 348.36cc, ఎయిర్‌కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ BSVI OBD2-B కంఫ్లైంట్‌కు అనుగుణంగా PGM Fi ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 5500rpm వద్ద 20.7 hp శక్తి, 3000rpm వద్ద 29.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








