Honda Shine 100 బైక్‌కు 10 సంవత్సరాల వారంటీ..!

హోండా మోటార్స్‌ తన 100 సీసీ సెగ్మెంట్‌ లోకి Shine 100తో తిరిగి ప్రవేశించింది. రాజస్థాన్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఈ బైక్‌ ధర రూ.64,900 ఉంది. అదే రాజస్థాన్‌లో 62,900 హోండా సంస్థ అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో షైన్‌ 100.. బజాజ్‌ ప్లాటినా 100, హీరో స్ప్లెండర్‌+ మరియు హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

హోండా షైన్‌ వినియోగదారులకు అనేక ఆఫర్లు ఇచ్చింది. 100 పే 100 ప్రత్యేక ఫైనాన్స్‌ స్కీమ్‌ ఆఫర్ల ప్రకటించింది. వీటిలో తమకు కావాల్సిన ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మరియు ఇందుకు 0 రూపాయల డాక్యుమెంట్‌ ఛార్జీలు వసూలు చేస్తామని, మందస్తుగా ఎటువంటి ఈఎంఐ వసూలు చేయబోమని, ప్రొసెసింగ్‌ ఫీజు కింద రూ.1 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.

Honda shine 100 warranty

వీటితో పాటు వినియోగదారులు 10 సంవత్సరాల వారంటీని పొందవచ్చని వెల్లడించింది. అందులో 3 ఏళ్లు స్టాండర్డ్‌ వారంటీ, మరో 7 సంవత్సరాలు ఆప్షనల్‌ వారంటీగా వస్తుందని తెలిపింది.. అయితే ఈ ధరలు మరియు ఆఫర్లు ప్రస్తుతం రాజస్థాన్‌, బిహార్‌, లక్నోకు మాత్రమే వర్తిస్తాయి.

హోండా షైన్‌ మొత్తం 5 రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లాక్‌ విత్‌ రెడ్‌ స్ట్రెప్స్, బ్లాక్‌ విత్ బ్లూ స్ట్రెప్స్, బ్లాక్‌ విత్ గ్రీన్‌ స్ట్రెప్స్, బ్లాక్ విత్‌ గోల్డ్‌ స్ట్రెప్స్, మరియు బ్లాక్‌ విత్‌ గ్రే స్ట్రెప్స్ కలర్‌లో అందుబాటులో ఉంది. అల్యూమినియం గ్రాబ్‌ రైయిల్‌, హాలోజన్‌ హెడ్‌ల్యాంప్, బోల్డ్‌ టెయిల్ ల్యాంప్, అల్లాయ్‌ వీల్స్ ఈ బైక్‌ సొంతం.

హోండా షైన్‌ 100 బైక్‌.. 98.98 ఎయిర్ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ 7500 rpm వద్ద 7.2 bhp మరియు 5000 rpm వద్ద 8.05 గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ 4 యూనిట్లను కలిగి ఉంటుంది. షైన్ 100 బైక్‌ ఇంజిన్‌ సామర్థ్యం తక్కువ ఉన్నప్పటికీ.. అధునాతన ప్యూయల్‌ ఇంజెక్షన్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇలాంటి వాహనాల్లో ఇంధన సామర్థ్యం చాలా ముఖ్యం. అనేక మంది వినియోగదారులు ఇంధన సామర్థ్యాన్ని కీలకంగా భావిస్తారు. ఈ బైక్‌ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా స్మూత్‌గా స్టార్‌ అవుతుంది. ఈ బైక్‌లో మరొక కీలక ఫీచర్‌ ఉంది. సైడ్‌ స్టాండ్‌ ఉంటే ఇంజిన్‌ స్టార్ట్‌ అవ్వదు.

హోండాలో యాక్టీవా స్కూటర్‌ తర్వాత బాగా పాపులర్‌ అయిన బైక్‌ షైన్‌. 100 cc షైన్‌ ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్లో 15-20 మార్కెట్‌ వాటాను పొందగలిగితే దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించనుంది. ప్రస్తుతం షైన్‌ 125.. హోండాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిల్లో ఒకటి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 19, 2023, 18:17 [IST]
English summary
Honda offers 10 years warranty on shine 100 bikes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+